Friday, October 7, 2022
More
  Home latest స‌మంత అనారోగ్యంలో నిజ‌మెంత‌?

  స‌మంత అనారోగ్యంలో నిజ‌మెంత‌?

  విధాత‌, సినిమా: ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో హ‌డావిడి చేసే క‌థానాయిక‌, తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయికలలో సమంత రూత్ ప్రభు ఒకరు. తమిళంలోనూ అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేశారు. నిజం చెప్పాలంటే… ఇప్పుడు సమంత పాన్ ఇండియా స్టార్. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తర్వాత ఉత్తరాదిలోనూ సమంతకు ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఆవిడ ఏం చేసినా… ఎక్కడికి వెళ్లినా… సంచలనం అవుతోంది.

  స‌మంత గ‌త రెండు నెల‌లుగా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఏ ఫంక్ష‌న్‌లోనూ, యాడ్స్ లోనూ క‌న‌బ‌డ‌క‌పోయే స‌రికే ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు నెట్టింటా ఒక‌టే గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. అరుదైన చ‌ర్మ సంబంధ వ్యాధితో స‌మంత బాధ‌ప‌డుతున్నార‌ని, ఈ క్ర‌మంలోనే ఆమె చికిత్స కోసం అమెరికా వెళుతున్నార‌ని రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఒక‌టే ట్రోల్ అవుతోంది.

  ఈ విష‌యంపై ఓ ఆంగ్ల ప‌త్రిక స‌మంత మేనేజ‌ర్‌ను సంప్ర‌దించ‌గా, అలాంటిదేమీ లేద‌ని, సమంత ఆరోగ్యంగానే ఉన్నార‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌స్తున్న ఖుషీ సినిమాలో స‌మంత న‌టిస్తున్నారు. ఇక స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన య‌శోద కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

  ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. తన క్రేజ్ పెరగడంతో సమంత రెమ్యూనరేషన్ కూడా పెంచారట. ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అమ్మడు రూ. రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలకు రూ. రెండున్నర కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఇప్పుడు ఎవరైనా సంప్రదిస్తే… మూడున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట.

  ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమా చిత్రీకరణలు పూర్తి అయ్యాయి. ఆ రెండు సినిమాలు పక్కన పెడితే ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమా ‘ఖుషి’. అందులో విజయ్ దేవరకొండకు జోడీగా ఆమె నటిస్తున్నారు. ఆ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. గతంలో ‘మజిలీ’ వంటి హిట్ సినిమా సమంత, శివ నిర్వాణ ఖాతాలో ఉంది.

  అయితే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 తరువాత సమంత క్రేజ్ పెరిగింది. ఓటీటీ, శాటిలైట్ ఛానెల్స్ లో తన సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. అందుకే సమంత పారితోషికం విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదట. నయనతార తరహాలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలపై కాన్సంట్రేట్ చేసిన సమంత… రెమ్యూనరేషన్ కూడా ఆమెలా డిమాండ్ చేస్తున్నారట.

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  Most Popular

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page