నేనేం వీక్‌గా లేను.. కావాలంటే చూసుకోండి: సమంత విధాత‌: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవల అరుదైన కండరాల వ్యాధి మయోసైటీస్ బారిన పడిన విషయం తెలిసిందే. దాంతో కొంతకాలం ఆమె నటనకు బ్రేక్ ఇచ్చింది. ఈ వ్యాధికి చికిత్స తీసుకుంది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమె దర్శనమిచ్చింది. ఆ త‌ర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి తన తాజా చిత్రం ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఫేసులో మునుపటి గ్లో లేదని, మొహమంతా ఆయిలీగా […]

  • నేనేం వీక్‌గా లేను.. కావాలంటే చూసుకోండి: సమంత

విధాత‌: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవల అరుదైన కండరాల వ్యాధి మయోసైటీస్ బారిన పడిన విషయం తెలిసిందే. దాంతో కొంతకాలం ఆమె నటనకు బ్రేక్ ఇచ్చింది. ఈ వ్యాధికి చికిత్స తీసుకుంది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమె దర్శనమిచ్చింది. ఆ త‌ర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి తన తాజా చిత్రం ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో పాల్గొంది.

ఈ సందర్భంగా ఆమె ఫేసులో మునుపటి గ్లో లేదని, మొహమంతా ఆయిలీగా ఉందని, ఆమె చాలా బలహీన పడిందని సన్నగా తయారయిందని ఇలా పలు వార్తలు షికారు చేశాయి. కాగా సమంత నటించిన యశోద మూవీ ఆమె మయోసైటీస్ బారిన పడిన తర్వాత విడుదలై మంచి విజయం సాధించింది.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17వ తారీఖున థియేటర్లలోకి రానుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ అందరినీ మెప్పించేలా సాగింది.

దీంతో పాటు సమంత ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే చిత్రం చేస్తోంది. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చింది. త్వ‌ర‌లో ఆ చిత్రం షూటింగ్‌లో కూడా ఆమె పాల్గొన‌నుంద‌ని సమాచారం.

ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో తన మ‌జిల్స్ చూపిస్తూ కొత్త ఫొటోలు షేర్ చేసింది. తాను బలహీనంగా మారినట్టు ఓ న్యూస్ పోర్టల్ నెగటివ్ కామెంట్ పోస్ట్ చేయగా.. సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తను జిమ్ములో వర్కౌట్ చేస్తున్న ఫొటోలను తాజాగా విడుదల చేసింది.

తను అద్దం ముందు నిలబడి కండలు ప్రదర్శిస్తుండగా ఆమె ఫిట్నెస్ ట్రైనర్ ఈ ఫోటోలను తీశారు. ఇందులో పింక్ బ్రౌన్ టాప్ ధరించి ఉన్న సామ్ తన మజిల్స్ చూపిస్తూ అంత డెలికేటెడ్‌గా ఏం లేదు అని క్యాప్షన్ ఇచ్చింది.

దాంతో ఆమె తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పినట్టుగా అయింది. ఆమె పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని, కావాలంటే చూసుకోండి అనేలా ఇలా పిక్‌తో క్లారిటీ ఇచ్చిందని ఇప్పుడంతా అనుకుంటున్నారు.

Updated On 19 Jan 2023 8:18 AM GMT
krs

krs

Next Story