విధాత: హిందువులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు కూడా తెల్ల దుస్తులు ఆధ్యాత్మికతకు చిహ్నాలు. ఇక క్రిస్టియన్స్‌లో ఉండే నన్స్ గానీ, హిందువులలో బ్రహ్మకుమారి సమాజం, హరే రామ హరే కృష్ణ, ఇస్కాన్ ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థల్లో పూర్తిగా లీన‌మైన వారు వైట్ అండ్ వైట్ దుస్తులను ధరిస్తారు. ఇక హరే రామ హరే కృష్ణ వారి చేతిలో అయితే ఎప్పుడూ ఒక జపమాల ఉంటుంది. రోజుకి ఇన్ని వేలు.. ఇన్ని లక్షల సార్లు జపం చేయాలనే నిబంధన ఉంటుంది. […]

విధాత: హిందువులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు కూడా తెల్ల దుస్తులు ఆధ్యాత్మికతకు చిహ్నాలు. ఇక క్రిస్టియన్స్‌లో ఉండే నన్స్ గానీ, హిందువులలో బ్రహ్మకుమారి సమాజం, హరే రామ హరే కృష్ణ, ఇస్కాన్ ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థల్లో పూర్తిగా లీన‌మైన వారు వైట్ అండ్ వైట్ దుస్తులను ధరిస్తారు. ఇక హరే రామ హరే కృష్ణ వారి చేతిలో అయితే ఎప్పుడూ ఒక జపమాల ఉంటుంది. రోజుకి ఇన్ని వేలు.. ఇన్ని లక్షల సార్లు జపం చేయాలనే నిబంధన ఉంటుంది. దాని వలన మనశ్శాంతి, ఆరోగ్యం, దైవ శక్తి సహకరిస్తాయని వారి నమ్మకం.

వాస్తవానికి సమంత విషయానికి వస్తే ఆమె స్వతహాగా క్రిస్టియన్ కానీ ఇటీవల ఆమె హిందూ మతం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు నాగచైతన్యతో విడాకులు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి విడాకులు తీసుకోవడం ఆమెను చాలా బాధించిందట. అదే సమయంలో ప్రాణాంతకమైన మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుండి ఆమె కోలుకుంటోంది. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఈమె వైట్ అండ్ వైట్ దుస్తుల్లో చేతిలో జపమాలతో కనిపించింది.

తాజాగా శాకుంతలం ప్రమోషన్స్‌లో కూడా ఈమె జపమాల ధరించి తెల్లని వస్త్రాలను ధరించింది. ఈమె ప్రస్తుతానికి పదివేల ఎనిమిది సార్లు జపం చేస్తున్నట్టు సమాచారం. అన్ని సార్లు జపం చేయాలంటే ఒక గంట రెండు గంటలు సరిపోవు. కాబట్టే ఆమె ఎక్కడికి వెళ్లినా జపమాలను తీసుకుని తెల్లని వస్త్రాలు ధరించి వెళ్తోందని అంటున్నారు.

ఆమెలో ఈమధ్య బాగా ఆధ్యాత్మిక చింతన పెరిగిందట. హిందూమతం కూడా పుచ్చుకొని హిందూ ధర్మం ప్రకారం దైవచింతన్లో మునిగిపోతుందని, తద్వారా మానసిక ప్రశాంతతను కోరుకుంటుందని టాలీవుడ్‌లో బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ రకంగానైనా సమంత అనారోగ్యం నుండి, విడాకుల డిప్రెషన్ నుండి బయటపడుతుందేమో చూద్దాం.

Updated On 14 Jan 2023 4:26 AM GMT
krs

krs

Next Story