విధాత: సమాజంలో ఆడవారి కంటే మగవారి డామినేషన్ ఎక్కువ అని పురుషాహంకారం చాలా ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ ఉంటారు. కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మగవారు ఏడిస్తే అతన్ని తప్పు పడతారు. అదే ఆడవారు ఏడిస్తే జాలి పడతారు. దీన్నే ఆయుధంగా చేసుకొని తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి సమంత ప్రయత్నిస్తోంది అని సీనియర్ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
మీడియా ముందు శాకుంతలం ప్రమోషన్స్‌లో సమంత ఏడవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా పబ్లిక్‌లో ఏడవలసిన అవసరం లేదు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్. సింపతితో తన సినిమా హిట్ చేసుకోవాలని ఆమె చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది అని మండిపడ్డారు.
యశోద చిత్రం సమయంలో కూడా ఆమె ఇదే చేశారు. మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతూ డబ్బింగ్ చెప్పినట్లు ఫోటోలు విడుదల చేసి ప్రచారం కల్పించుకున్నారు. మయోసైటిస్ ప్రాణాంతక వ్యాధి కాదు… అది చాలా మందికి వచ్చింది. వారంతా బాగానే ఉన్నారు.
ప్రముఖులు చనిపోతే చివరి చూపు చూడని నాగార్జున! భయమా..లేక సెంటిమెంటా?
సమంత ఈ నాటకాలు ఆపితే బెటర్ అని చిట్టిబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో కూడా కొంత వాస్తవం ఉందనే చెప్పాలి. సమంత కూడా యశోద సమయంలో ఇలాగే చేసింది. షూటింగ్లో యాక్టివ్‌గా ఉన్న ఆమె ఆ సినిమా విడుదలకు ముందు తనకు మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిందని పోస్ట్ పెట్టింది.
యశోద షూటింగ్ సమయంలో మాత్రం సమంతలో ఎలాంటి అనారోగ్యం కనిపించ లేదని సహ నటీనటులు చెప్తున్నారు. దాంతో ఇప్పుడు శాకుంతలం మూవీ కోసం ఆమె అదే రకమైన ట్రిక్స్ ప్లే చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. నాగచైతన్య వైపు ఆలోచించకుండా కేవలం సమంత వైపే ఆలోచిస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.