Sarpanch Suicide Attempt BRS
విధాత, నిజామాబాద్: నిజామాబాద్ న్యూకలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. పెండింగ్‌లో ఉన్న తమ బిల్లులు రావడం లేదని మనోవేదనకు గురైన నందిపేటకు చెందిన సర్పంచ్ సాంబార్ వాణి.. వార్డ్ మెంబర్ అయిన తన భర్త తిరుపతితో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించారు.
రెండు కోట్లతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే.. అందుకు సంబంధించిన బిల్లుల చెక్కులపై సంతకాలు చేయకుండా ఉప సర్పంచ్ మాద రవి వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. బీజేపీ నుంచి ఎన్నికైన తాను.. గ్రామంలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్‌లో చేరానని, అయినా తనపై వేధింపులు ఆపలేదని చెప్పారు.
పెండింగ్ బిల్లుల కోసం.. నందిపేట సర్పంచ్ దంపతులు సాంబార్ వాణి ఆమె భర్త ఆత్మహత్యాయత్నం pic.twitter.com/ZCGPNLPfJd
— vidhaathanews (@vidhaathanews) January 30, 2023
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం తమను వేధిస్తూ పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని కిరోసిన్ పోసుకున్నామని వెల్లడించారు.
తాను పది మందిని ఆదుకున్నానని, ఇప్పుడు తన పరిస్థితి దీనంగా మారిందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కోట్ల రూపాయలు మిత్తితో కలిపి మూడు కోట్ల వరకు చేరిందని అన్నారు. చేతిలో డబ్బులు లేక, పెండింగ్ బిల్లులు రాక దీనస్థితిలో ఉన్నానని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదన్నారు.
View this post on Instagram