Homeక్రైమ్‌Sarvail | ఫోన్ మాట్లాడుతుండగా.. పిడుగుపాటుతో రైతు మృతి.. కోమటిరెడ్డి, చల్లమల ఆర్థిక సాయం

Sarvail | ఫోన్ మాట్లాడుతుండగా.. పిడుగుపాటుతో రైతు మృతి.. కోమటిరెడ్డి, చల్లమల ఆర్థిక సాయం

Sarvail

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం సర్వేల్ పంచాయతి పరిధిలోని మర్రిగూడెం లో బుధవారం భారీ వర్షం లో పిడుగు పడటంతో కౌలు రైతు ఎల్లంకి శేఖర్ గౌడ్(36) దుర్మరణం చెందాడు. తన కౌలు భూమిలో ట్రాక్టర్‌తో ఎల్లంకి శేఖర్ భూమి దున్నుతుండగా అదే సమయంలో వర్షం రావడంతో పక్కనే ఉన్న చిన్న గదిలో తలదాచుకున్నారు.

ఇదే సమయంలో శేఖర్ గౌడ్ సెల్ ఫోన్ మాట్లాడుతుండగా గదిపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో ఎల్లంకి శేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని అన్న వెంకటేష్, అతని కుమారుడు పరమేశులు తీవ్రంగా గాయ పడ్డారు. వెంకటేష్, పరమేశ్వర్లను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

మృతుడు శేఖర్ కుటుంబాన్ని గురువారం పరామర్శించిన మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ చల్లమల కృష్ణారెడ్డి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అటు మాజీ శాసనసభ్యుడు, బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం శేఖర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular