విధాత: కొందరు మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ఏం చేయలేర‌నే ధోర‌ణితో ముందుకు పోతున్నారు. ఈ దుర్మార్గాలు అరిక‌ట్ట‌ బ‌డాలి. దుర్మార్గాన్ని ఉపేక్షించ‌డం అనేది ఏ ఒక్క‌రికి, దేశం ఉనికికి మంచిది కాదని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే బీజేపీ కొంటుంది. రూ. 100 కోట్లు ఇస్తం, గ‌తంలో అలానే ఇచ్చాం, ఇది మాకు నిత్య కృత్య‌మే. మిగ‌తావి కూడా చేసుకుంటాం. సెక్యూరిటీ కూడా […]

విధాత: కొందరు మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ఏం చేయలేర‌నే ధోర‌ణితో ముందుకు పోతున్నారు. ఈ దుర్మార్గాలు అరిక‌ట్ట‌ బ‌డాలి. దుర్మార్గాన్ని ఉపేక్షించ‌డం అనేది ఏ ఒక్క‌రికి, దేశం ఉనికికి మంచిది కాదని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే బీజేపీ కొంటుంది. రూ. 100 కోట్లు ఇస్తం, గ‌తంలో అలానే ఇచ్చాం, ఇది మాకు నిత్య కృత్య‌మే. మిగ‌తావి కూడా చేసుకుంటాం. సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్త‌మ‌ని చెప్త‌రు. సెంట్ర‌ల్ సెక్యూరిటీ వై కేట‌గిరి ఇస్త‌మ‌ని చెప్త‌రు. రాజ్యాంగేత‌ర శ‌క్తుల్లో భార‌త ప్ర‌భుత్వం ఉంది. ఈ వీర‌విహారం అరిక‌ట్ట‌ బ‌డ‌క‌పోతే అంద‌రికీ ప్ర‌మాద‌మే. ఈ ప‌ద్ధ‌తిని ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాలన్నారు.

ప్ర‌తి స్టేట్‌లో త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్త‌రు.. ప్ర‌ధానిగారే చెబుతున్నారు. ఇదేం దేశం. ఇష్ట‌ం వచ్చిన‌ట్లు ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారు. ఇవన్నీ కూడా బ‌య‌ట‌కు రావాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు. కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారు. ఈ ఎన్నిక‌లు ఇవ‌న్నీ ఎందుకు. ఈ ర‌క‌మైన ప‌ద్ధ‌తులు మంచిది కాదు. మేం దుర్మార్గంగా ఎమ్మెల్యేల‌ను క‌లుపుకోలేదు.

కొంద‌రు కాంగ్రెస్ మిత్రులు మాద‌గ్గ‌రికి వ‌చ్చి క‌లుస్తామ‌ని చెప్పారు. చాలా రోజుల త‌ర్వాత రాజ్యాంగ‌ బ‌ద్ధ‌మైన ప‌ద్ద‌తుల్లో క‌లుపుకున్నాం. కానీ మీలా కొనుగోలు చేయ‌లేదు. ఎమ్మెల్యేల‌ను కొంటామ‌ని చెప్పి.. నీ ప్ర‌భుత్వాన్ని కూల‌ గొడుతామ‌ని వ్య‌వ‌హ‌రిస్తే మేం చేతులు ముడుసుకొని కూర్చోవాలా? మీ అరాచ‌క వ్య‌వ‌హారాన్ని నిశ‌బ్దంగా భ‌రించాలా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం గురించి కొన్ని విష‌యాలు మీరు వింటే ఆశ్చ‌ర్య‌ప‌డుతారు. ఎంత భ‌యంక‌ర‌మైన ద‌గా, కుట్ర‌. అయితే స‌ఖ్య‌త లేదంటే ఈడీ అని బెదిరిస్తున్నారు. క‌ర్ణాట‌క‌లో ఎమ్మెల్యేల‌ను కొన్న‌ది మేమే. ఆ త‌ర్వాత లేబ‌ర్ వేషాలు వేయించి తీసుకెళ్లాం. ముంబైలో డబ్బులు ఇచ్చామ‌ని చెప్పారు. క్లియ‌ర్‌గా ఏం జ‌రిగిందో చెప్పారు. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు వెళ్లామ‌ని చెప్పారు.

20 సార్లు అమిత్ షా పేరు, ఒక‌ట్రెండు సార్లు మోదీ పేరు చెప్పారు. ఈ వేల కోట్ల ధ‌నం ఎక్క‌డిది. ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు రూ. 12 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని ఇటీవ‌లే ఓ ప‌త్రిక వాళ్లు రాశారు. ఇవ‌న్నీ బ‌య‌ట‌కు రావాలి. ఈ ముఠా నాయ‌కుడు ఎవ‌రో బ‌య‌ట‌కు రావాలి. ఈ డ‌బ్బుల‌ను ఎవ‌రు తీసుకొచ్చారు. ఈ దేశం యొక్క న్యాయ‌వ్య‌వ‌స్థ‌తో దండం పెట్టి అడుగుతున్నా.

ఈ దేశం ఎప్పుడు ప్ర‌మాదంలో ప‌డ్డ ఈ దేశాన్ని కాపాడింది జ్యుడిషీయ‌రినే. త‌ప్ప‌కుండా కాపాడింది. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక మీద తీర్పు ఇచ్చింది. ఇంత స్వైర‌విహారం స‌రికాదు. క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌లో కూల‌గొట్టింది మేమే అని నిసిగ్గుగా చెబుతున్నారు. రిసార్టుల్లో ఉండి ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్టామ‌ని చెప్పారు. భార‌తీయ న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా.. ద‌య‌చేసి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల‌ని కోరుకుంటున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

భారమైన మనసుతో, దుఖంతో ఈ ప్రెస్‌మీట్‌: CM KCR

Updated On 4 Nov 2022 2:16 AM GMT
krs

krs

Next Story