Breast Cancer | అత్యంత అరుదైన‌విగా క‌నుగొన్న వైద్య ప‌రిశోధ‌కులు నేచర్ జెనెటిక్స్ జర్నల్‌లో ప్ర‌చురిత‌మైన ప‌రిశోధ‌న వ్యాసం విధాత‌: రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన నాలుగు కొత్త జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి అరుదైన‌విగా గుర్తించారు. మహిళ‌ల్లో వ్యాధి ప్రమాద తీవ్ర‌త ఏ స్థాయిలోఉన్న‌దో గుర్తించ‌డానికి ఇవి సహాయపడతాయ‌ని తెలిపారు. యూకేలోని కేంబ్రిడ్జ్ వ‌ర్సిటీ (Cambridge University), కెనడాలోని యూనివర్సిటీ లావల్ పరిశోధకుల నేతృత్వంలోని శాస్త్ర‌వేత్త‌ల‌ బృందం రొమ్ము క్యాన్సర్‌లో కొత్త జన్యువుల గుర్తింపుపై ప‌రిశోధ‌న జ‌రిపింది. […]

Breast Cancer |

  • అత్యంత అరుదైన‌విగా క‌నుగొన్న వైద్య ప‌రిశోధ‌కులు
  • నేచర్ జెనెటిక్స్ జర్నల్‌లో ప్ర‌చురిత‌మైన ప‌రిశోధ‌న వ్యాసం

విధాత‌: రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన నాలుగు కొత్త జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి అరుదైన‌విగా గుర్తించారు. మహిళ‌ల్లో వ్యాధి ప్రమాద తీవ్ర‌త ఏ స్థాయిలోఉన్న‌దో గుర్తించ‌డానికి ఇవి సహాయపడతాయ‌ని తెలిపారు.

యూకేలోని కేంబ్రిడ్జ్ వ‌ర్సిటీ (Cambridge University), కెనడాలోని యూనివర్సిటీ లావల్ పరిశోధకుల నేతృత్వంలోని శాస్త్ర‌వేత్త‌ల‌ బృందం రొమ్ము క్యాన్సర్‌లో కొత్త జన్యువుల గుర్తింపుపై ప‌రిశోధ‌న జ‌రిపింది. యూరప్, ఆసియాలోని ఎనిమిది దేశాల నుంచి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 26,000 మంది మహిళల్లో, 2.17 లక్షల మంది మహిళల్లో అన్ని జన్యువుల్లో జన్యు మార్పులపై బృందం పరిశోధ‌న జ‌రిపింది.

రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన ప్రస్తుత జన్యు పరీక్షలు BRCA1, BRCA2, PALB2 వంటి కొన్ని జన్యువులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామ‌ని అధ్య‌య‌న బృందం కోఆర్డినేట‌ర్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డగ్లస్ ఈస్టన్ తెలిపారు.

ఈ ప‌రిశోధ‌న‌కు సంబంధించిన వ్యాసం నేచర్ జెనెటిక్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించమైంది. ఇత‌ర జీవ‌న విధానాల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతాయ‌ని, కొత్త చికిత్సలను గుర్తించడానికి ఇవి స‌హాయ ప‌డ‌తాయ‌ని ఈస్ట‌ర్ తెలిపారు. రొమ్ము స్క్రీనింగ్, రిస్క్ తగ్గింపు, క్లినికల్ చికిత్స విధానాలను మెరుగు ప‌ర్చుకోవ‌డానికి ఈ ప‌రిశోధ‌న‌లు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు.

Updated On 23 Aug 2023 6:49 AM GMT
somu

somu

Next Story