SCR | విజయవాడ డివిజన్‌లో పలు మెయింటనెన్స్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. సోమవారం నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆయా రైళ్లను రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. విజయవాడ-బిట్రగుంట ( రైలు నంబర్ 07978) సెప్టెంబర్ 2 వరకు, బిట్రగుంట - విజయవాడ రైలును 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237) ట్రైన్‌ను […]

SCR |
విజయవాడ డివిజన్‌లో పలు మెయింటనెన్స్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. సోమవారం నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆయా రైళ్లను రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
విజయవాడ-బిట్రగుంట ( రైలు నంబర్ 07978) సెప్టెంబర్ 2 వరకు, బిట్రగుంట - విజయవాడ రైలును 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237) ట్రైన్‌ను 28 నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు, చెన్నై సెంట్రల్ - బిట్రగుంట రైలును 28 నుంచి వచ్చే ఒకటి వరకు తాత్కాలికంగా రద్దు చేసింది.
రాజమండ్రి-విశాఖపట్నం (07466), విశాఖపట్నం-రాజమండ్రి (07467) ట్రైన్స్‌ను 3 వరకు రద్దు చేస్తున్నట్లు చెప్పింది. కాకినాడ పోర్ట్-విశాఖపట్నం (17267) ట్రైన్, విశాఖపట్నం-కాకినాడ పోర్ట్ (17268), గుంటూరు-విశాఖపట్నం (17239) రైళ్లను 28 నుంచి 3 వరకు రద్దు చేసింది.
విశాఖపట్నం-గుంటూరు (17240) ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 4 వరకు రద్దు చేయగా.. విజయవాడ-విశాఖపట్నం (22702) రైలును ఈ నెల 28, 29, 30, సెప్టెంబర్ 1, 3 తేదీల్లో రద్దు చేసింది. విశాఖటప్నం-విజయవాడ (22701) రైలును ఈ నెల 28, 29, 30, సెప్టెంబర్ 1, 3 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
విజయవాడ-గూడూరు (07500) రైలును ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు, గూడూరు-విజయవాడ రైలు (07458)ను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పలు రైళ్లను దారి మళ్లించింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది.
