Homeవార్త‌లుChimpanzee | చనిపోయిందనుకున్న బిడ్డ కనిపించే సరికి.. తల్లి చింపాంజీ భావోద్వేగం

Chimpanzee | చనిపోయిందనుకున్న బిడ్డ కనిపించే సరికి.. తల్లి చింపాంజీ భావోద్వేగం

విధాత: ఒక్కోసారి చిన్నచిన్న విషయాలే వైరల్‌ అవుతుంటాయి. భావోద్వేగాలకు సంబంధించిన వీడియోలైతే నిమిషం లోపు ఉన్నా.. కోట్ల మంది హృదయాలను గెలుచుకుంటాయి. అలాంటిదే ఈ వీడియో.

పుట్టిన తర్వాత 48 గంటల పాటు తనకు కనిపించకుండా పోయిన తన బిడ్డను చూసిన తల్లి చింపాంజీ (Chimpanzee) ఒక్కసారిగా తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని.. గుండెలకు హత్తుకున్న దృశ్యం నెటిజన్ల మనస్సును హత్తుకున్నది.

పాతదే అయినప్పటికీ.. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్‌ అవుతున్నది. దీన్ని కన్సాస్‌ (Kansas)లోని సెడ్జ్‌విక్‌ కౌంటీ జూ(Sedgewick County zoo)లో చిత్రీకరించారు. వివరాళ్లోకి వెళితే..

సెడ్జ్‌విక్‌ కౌంటీ జూలో ఒక చింపాజీ ఓ పిల్లకు జన్మనిచ్చింది. అయితే.. అది పుట్టిన వెంటనే వెటర్నరీ డాక్టర్లు వైద్య చికిత్సల నిమిత్తం దానిని తీసుకుని వెళ్లిపోయారు. ఇదేమీ తెలియని తల్లి.. తన బిడ్డ చనిపోయిందేమో అనుకొని తల్లడిల్లిపోయింది.

వైద్య పరీక్షలు, చికిత్స పూర్తయిన 48 గంటల అనంతరం డాక్టర్లు ఒక వస్త్రంలో దానిని జాగ్రత్తగా చుట్టి తల్లి చింపాంజీ గది దగ్గర ఉంచారు. కాసేపటికి అక్కడికి వచ్చిన తల్లి.. కొద్ది క్షణాలు మౌనంగా అక్కడే ఉంది.

అంతలో పిల్ల చింపాజీ మెల్లగా చేయి లేపడంతో తల్లి తీవ్ర భావోద్వేగానికి గురై వెంటనే తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది. అద్భుతమైన ఈ క్షణాలను అక్కడే ఉన్న సీసీ కెమెరా జాగ్రత్తగా నిక్షిప్తం చేసింది.. దానిని మీరూ చూసేయండి.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular