Saturday, January 28, 2023
More
  Homelatestపాముతో సెల్ఫీ.. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు

  పాముతో సెల్ఫీ.. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు

  విధాత‌: స్మార్ట్ ఫోన్లు వ‌చ్చాక సెల్ఫీ మోజులో ప‌డి చాలా మంది యువ‌త త‌మ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. వేగంగా వ‌స్తున్న రైళ్ల వ‌ద్ద‌, జ‌లపాతాల వ‌ద్ద‌, క్వారీ గుంత‌లతో పాటు ప‌లు ప్ర‌మాద‌క‌ర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకునేందుకు యువ‌త ప్ర‌య‌త్నించి, ప్రాణాలు పొగొట్టుకున్న అనేక ఘ‌ట‌న‌ల‌ను చూశాం. తాజాగా ఓ యువ‌కుడి అత్యుత్సాహం అత‌ని ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది.

  వివ‌రాల్లోకి వెళ్తే.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తాళ్లూరుకు చెందిన మ‌ణికంఠ రెడ్డి.. కందుకూరులో జ్యూస్ సెంట‌ర్ నిర్వ‌హిస్తున్నాడు. అయితే మంగ‌ళ‌వారం రాత్రి కందుకూరులోని ఆర్టీసీ బ‌స్టాండ్ వ‌ద్ద‌కు పాములు ఆడించే వ్య‌క్తి వ‌చ్చాడు. అత‌న్ని గ‌మ‌నించిన మ‌ణికంఠ రెడ్డి.. అక్క‌డికి వెళ్లి పాముతో ఆడేందుకు ఉత్సాహం చూపించాడు.

  ఇక అత‌డి నుంచి పామును తీసుకొని మ‌ణికంఠరెడ్డి త‌న మెడ‌లో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత దాన్ని మెడ‌లో నుంచి తీసి సెల్ఫీ దిగేందుకు య‌త్నించాడు. క్ష‌ణాల్లోనే ఆ యువ‌కుడిని పాము కాటేసింది. దీంతో హుటాహుటిన స్థానికులు ఒంగోలులోని రిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ మార్గ‌మ‌ధ్య‌లోనే మ‌ణికంఠ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular