Anasuya Bharadwaj
విధాత, సినిమా: అనసూయ భరద్వాజ్ న్యూస్ రీడర్ నుంచి మొదలై యాంకర్‌గా రాణించి సినిమా నటిగా సెటిలైంది. పేరుతో పాటు డబ్బు బాగానే సంపాదించింది. అంతేగాక నిత్యం ఏదో విషయంలో వార్తల్లో నిలుస్తూ ట్రెంగింగ్‌లో ఉంటుంది. హీరోలపై సెటైర్లు వేయడం, తన ఫోటో షూట్లతో, తన కామెంట్లతో ఎదుటి వారిపై విరుచుకు పడుతూ ఉంటుంది. ప్రతిదీ నేను చేసేది, చెప్పేదే వాస్తవం అన్నట్లు వ్యవహరిస్తూ ఫైర్ బ్రాండ్ అనే ముద్ర వేసుకుంది.
ఇక విషయానికొస్తే ఇటీవల ప్రపంచమంతా ప్రేమికుల రోజు జరుపుకుంటున్న సందర్భంలో అనసూయ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘నీతో జీవితం చాలా క్రేజీ’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీనికి ఓ ఫాలోవర్ రియాక్ట్ అయి హద్దు మీరి కామెంట్ చేశాడు. ‘అదేం లేదక్కా వాడి దగ్గర డబ్బుంది అందుకే అంటూ’ రాయడంతో అనసూయ ఫైర్ అయింది.
వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చేసింది. ‘అదేంట్రా తమ్ముడు అలా అనేశావు.. ఎంతుందేంటి డబ్బు…నా దగ్గర లేదా డబ్బు, అయినా ఆయన డబ్బు నా డబ్బు అనేది కూడా ఉందా రేయ్ చెప్పరా బాబు, అయినా బావ గారిని వాడు వీడు అనొచ్చా.. ఇదేం పెంపకం. నీ చెంపలేసుకో లేదంటే నేనే వేస్తా చెప్పుల తోటి చంపల మీద’ అని సమాధానం ఇచ్చింది.
View this post on Instagram
దీనికి నెటిజన్ మీరు నిజాన్ని అర్థం చేసుకునే అంగీకరించాలి.. మీరు ఎంత చెప్పినా రియాల్టీ రియాల్టీనే అని మరింత రెచ్చగొట్టాడు. దీనికి కాసేపటి తర్వాత అనసూయ ఓ రేంజిలో ఆగ్రహం ప్రదర్శించింది. ‘నీ బొంద రా నీ బొంద మాట్లాడడం నేర్చుకో ఫస్ట్ అంతర్యామిరా అని తెలిసి ఉంటే బిల్డప్ ఒకటి రా.. రియాల్టీ నీకేం తెలుసురా పచ్చ కామెర్ల రోగం వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట.
నీ బుద్ధి మనీ ఒకటే అయితే అందరిదీ అదే అనిపిస్తూ ఉంటుంది. వీలైతే మారు. గెట్ వెల్ సూన్.. తమ్ముడు కదా అని మంచి చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా’.. అంటూ నీతులు చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆ నెటిజన్ మరింత రెచ్చిపోయాడు నీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు కావాలంటే నీ రెజ్యూమ్ పంపు పనిమనిషిగా పెట్టుకుంటా అని రచ్చ లేపాడు.
దీనికి అనసూయ మరింతగా ఫైర్ అయింది. ‘నా ఇన్‌స్టాలో నేను ఫోటో పెట్టుకుంటే నీకెందుకురా.. అయినా నచ్చకపోతే నన్ను ఫాలో అవ్వడం ఎందుకు.. ఇక్కడ నుంచి దొబ్బెయ్’ అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత సదరు నెటిజన్ వరుసగా కామెంట్స్ చేస్తుండటంతో అనసూయ బాగా ఇబ్బంది పడి చివరకు సైలెంట్ అయిపోయింది.
దీంతో ఎప్పుడు మా మాటే నెగ్గాలనుకునే వారికి ఇలాగే అవుతుందని, నెటిజన్లు అన్న తర్వాత అందరూ ఒకేలా ఉండరని దీనినే కొందరు పిలిచి చెప్పుతో కొట్టించుకోవడం అంటారని కొందరు అనసూయకు హితబోధ చేస్తున్నారు. ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్నా.. అనసూయ, నెటిజన్ ఛాటింగ్‌పై మాత్రం వార్తలు ఆగడం లేదు. సరైన నెటిజన్ తగిలితే.. అనసూయే కాదు.. ఇంకేవరైనా సర్దేయాల్సింటే అంటూ ఈ ఛాట్‌ని తెగ వైరల్ చేస్తున్నారు.