Saturday, April 1, 2023
More
    HomelatestNampally Court: వ్యాపారవేత్త జయరాం హత్య కేసు.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు..!

    Nampally Court: వ్యాపారవేత్త జయరాం హత్య కేసు.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు..!

    • ప్ర‌ధాన నిందితుడు రాకేశ్‌రెడ్డికి జీవిత‌ఖైదు
    • స‌రైన ఆధారాలు లేనందున 11మందిని నిర్దోషులుగా తీర్పు

    విధాత‌: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు (Nampally court) సంచలన తీర్పు (Sensational verdict)ను వెలువరించింది. జయరాం హత్య కేసు (Jayaram’s murder case)లో ప్రధాన నిందితుడైన రాకేశ్‌రెడ్డి (Rakesh Reddy)కి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు ఇచ్చింది.

    ఏసీపీ మల్లారెడ్డి (ACp Malla reddy), ఇద్దరు సీఐలతో పాటు మొత్తం 11 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో జూబ్లీహిల్స్‌ పోలీసులు పేర్కొన్నారు.

    2019 జనవరి 31న పారిశ్రామికవేత్త జయరాంను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు దోషులు యత్నించారని, ఆ తర్వాత జయరాం మృతదేహాన్ని రాకేశ్‌ రెడ్డి తన స్నేహితులతో కలిసి కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ హత్యకు డబ్బు వ్యవహారమే ముఖ్యకారణం పోలీసులు తెలిపారు.

    ఈ మేరకు విచారణ చేపట్టి.. 2019 మే నెలలోనే నేరాభియోగపత్రం దాఖలు చేశారు. అభియోగాలపై దాదాపు నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు.. రాకేశ్‌రెడ్డిని దోషిగా తేల్చింది. మిగతా వారిపై ఆధారాలు లేనందున 11 మందిని నిర్దోషులుగా నిర్ణయిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.

    ఏం జరిగిందంటే..

    పారిశ్రామికవేత్త జయరాం 2019, జనవరి 31వ హత్యకు గురయ్యారు. రాకేశ్‌రెడ్డి స్నేహితులతో జయరాంను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై ఒక వాహనంలో వదిలేసి వెళ్లారు.

    ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టుకు పంపించారు. గత నాలుగేళ్లుగా హత్య కేసు విచారణ కొనసాగుతూనే ఉన్నది. అప్పట్లో ఈ కేసు దర్యాప్తును చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు రాకేశ్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన వారిని సైతం అరెస్ట్ చేశారు.

    దర్యాప్తు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టులో నేరాభియోగపత్రం దాఖలు చేశారు. నేరాభియోగపత్రంలో 45 మందిని సాక్షులుగా చేర్చారు. అయితే, వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన భేదాభిప్రాయాల కారణంగానే జయరాంను రాకేశ్‌ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు చార్జీషీట్‌లో పేర్కొన్నారు.

    ఈ కేసులో అప్పట్లో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు పోలీసు అధికారులు సైతం ఉన్నారు. దాదాపు నాలుగేళ్ల పాటు నాంపల్లి కేసును విచారిస్తున్నది. ఇటీవల రాకేశ్‌రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ తీర్పును రిజర్వు చేసింది.

    ఈ కేసులో రాకేశ్‌రెడ్డిని దోషిగా తేల్చి, మిగతా 11 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న విశాల్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనిపై వేరే కేసులు లేకపోతే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో రాకేశ్‌రెడ్డిని నాంపల్లి కోర్టు నుంచి తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular