HomelatestSperm Donor | వీర్య దానంతో 550 మందికి తండ్రైన డాక్ట‌ర్.. వెలుగులోకి ఇలా..

Sperm Donor | వీర్య దానంతో 550 మందికి తండ్రైన డాక్ట‌ర్.. వెలుగులోకి ఇలా..

Sperm Donor | వీర్యాన్ని దానం చేయ‌డం ఏంటి..? ఒకే డాక్ట‌ర్( Doctor ) 550 మందికి తండ్రి కావ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. నెద‌ర్లాండ్స్‌( Netherlands ) కు చెందిన 41 ఏండ్ల డాక్ట‌ర్.. వీర్య‌దానం చేసి 550 మందికి తండ్రి అయ్యాడు. ఓ మ‌హిళ ఫిర్యాదుతో ఈ విష‌యం వెలుగు చూసింది.

నెద‌ర్లాండ్స్‌లోని ది హేగ్ న‌గ‌రంలో జొన‌థ‌న్ ఎం( Jonathan  M ) (41) అనే డాక్ట‌ర్ నివ‌సిస్తూ, వైద్య వృత్తిని కొన‌సాగిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు నెద‌ర్లాండ్స్‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా 13 క్లినిక్స్‌లో జొన‌థ‌న్ వీర్య దానం( Sperm Donor ) చేసి 550 మందికి తండ్రి అయ్యాడు. అయితే నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక వ్య‌క్తి 12 మంది మ‌హిళ‌ల‌కు వీర్యం దానం చేయొచ్చు. లేదా 25 మంది పిల్ల‌ల‌కు తండ్రి కావొచ్చు. కానీ జొన‌థ‌న్ 550 మందికి తండ్రి అయిన‌ట్లు తెలియ‌డంతో ఓ మ‌హిళ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. జొన‌థ‌న్‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. అత‌ను 100 మందికి పైగా వీర్యం దానం చేసి ఉన్నాడ‌ని తెలిస్తే.. తాను జొన‌థ‌న్‌ను ఎంచుకోక‌పోయే దాన్ని అని ఆమె పేర్కొంది. అత‌ని వీర్యంతో పుట్టిన నా బిడ్డ భ‌విష్య‌త్ గురించి ఆందోళ‌న చెందుతున్నాను. అస‌లు ఆ విష‌యం త‌లుచుకుంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంద‌ని ఆమె తెలిపింది.

అయితే జొన‌థ‌న్ త‌న వీర్యం ద్వారా వంద మందికి పైగా చిన్నారుల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు 2017లోనే తెలిసింది. దీంతో నెద‌ర్లాండ్స్ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మై.. ది డ‌చ్ సొసైటీ ఆఫ్ అబ్డ్సెట్రిక్స్ అండ్ గైన‌కాల‌జీ అత‌న్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం జొన‌థ‌న్ కెన్యాలో ఉన్న‌ట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular