విధాత‌, హైదారాబాద్‌: సైబరాబాద్ పోలీసులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను రిమాండ్‌కు ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. పక్కా ప్లాన్‌తో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించినట్టు ఆధారాలున్నాయంటూ కోర్టు ముందు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించినప్పటికీ ధర్మాసనం కన్విన్స్ కాలేదు.పోలీసులు ఏసీబీ ప్రోజిజర్ ఫాలో కాలేదని కోర్టు అభిప్రాయ పడింది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్‌లో ఏసీబీ మాత్రమే అరెస్ట్ చూపాలని పేర్కొంది. […]

విధాత‌, హైదారాబాద్‌: సైబరాబాద్ పోలీసులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను రిమాండ్‌కు ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.

పక్కా ప్లాన్‌తో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించినట్టు ఆధారాలున్నాయంటూ కోర్టు ముందు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించినప్పటికీ ధర్మాసనం కన్విన్స్ కాలేదు.పోలీసులు ఏసీబీ ప్రోజిజర్ ఫాలో కాలేదని కోర్టు అభిప్రాయ పడింది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్‌లో ఏసీబీ మాత్రమే అరెస్ట్ చూపాలని పేర్కొంది.

లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఈ నిందితులను రిమాండ్ చేసే అర్హత లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పీసీ యాక్ట్ పెట్టినప్పుడు ఏసీబీ రూల్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలని కోర్టు పేర్కొంది. కాగా తొలుత ఏసీబీ కోర్టు సైతం నిందితుల రిమాండ్‌ను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

Updated On 29 Oct 2022 7:37 AM GMT
Somu

Somu

Next Story