విధాత‌, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియండెట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ కోవలోనే సమంత ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తూ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శాకుంతలం’ సినిమా విడుదల తేదీని నవంబర్ 4వ తేదీగా ఫిక్స్ చేశారు. శుక్రవారం ఉదయం చిత్ర నిర్మాణ సంస్థలు గుణ టీం వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించడమే గాక మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశాయి. […]

విధాత‌, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియండెట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ కోవలోనే సమంత ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తూ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శాకుంతలం’ సినిమా విడుదల తేదీని నవంబర్ 4వ తేదీగా ఫిక్స్ చేశారు.

శుక్రవారం ఉదయం చిత్ర నిర్మాణ సంస్థలు గుణ టీం వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించడమే గాక మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశాయి.

మహా భారతంలోని శకుంతల, దుష్యంతుల పాత్రల ఆధారంగా ఈ ప్రేమ కథ తెరకు ఎక్కింది. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శాకుంతల పాత్రలో సమంత, దుష్యంతుని పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్, నీలిమలు ఈ భారీ చిత్రానికి నిర్మాతలు కాగా అల్లు అర్జున్ కుమార్తె అర్హ ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నది.

Updated On 23 Sep 2022 10:29 AM GMT
somu

somu

Next Story