Shakeela | ఒకప్పుడు స్టార్ హీరోలని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది షకీలా. ఆమె సినిమా థియేటర్స్ కళకళలాడేవి. శృంగార కథానాయికగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న షకీలా మలయాళ చిత్ర పరిశ్రమని షేక్ చేసింది. ఇక వయస్సు పెరగడం తర్వాత సపోర్టింగ్ పాత్రలు చేసింది. అయితే కొంత కాలంగా సినిమాలలో పెద్దగా కనిపించని షకీలా ఇప్పుడు కమ్ బ్యాక్ కావాలనుకుంటుంది. మంచి క్యారెక్టర్స్ వస్తే చేయాలని అనుకుంటుంది. అయితే ఎవరు ఊహించని విధంగా షకీలా బిగ్ […]

Shakeela |
ఒకప్పుడు స్టార్ హీరోలని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది షకీలా. ఆమె సినిమా థియేటర్స్ కళకళలాడేవి. శృంగార కథానాయికగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న షకీలా మలయాళ చిత్ర పరిశ్రమని షేక్ చేసింది. ఇక వయస్సు పెరగడం తర్వాత సపోర్టింగ్ పాత్రలు చేసింది.
అయితే కొంత కాలంగా సినిమాలలో పెద్దగా కనిపించని షకీలా ఇప్పుడు కమ్ బ్యాక్ కావాలనుకుంటుంది. మంచి క్యారెక్టర్స్ వస్తే చేయాలని అనుకుంటుంది. అయితే ఎవరు ఊహించని విధంగా షకీలా బిగ్ బాస్ 7లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షోలో స్లో అండ్ స్టడీగా గేమ్ ఆడుతూ అందరిని ఆశ్చర్య పరిచింది.
ఇన్నాళ్లు తనపై అందరిలో ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు అది పోయి తాను షకీలా అమ్మగా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవాలని భావిస్తుంది. అయితే షకీలా జీవితంలో అనేక ఆసక్తికర విషయాలు ఉండగా, వాటిని బిగ్ బాస్ షోకి వెళ్లే ముందు తెలియజేసింది.
యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్ స్టోరీ, ప్రెగ్నెంట్, అబార్షన్ వంటి విషయాల గురించి మాట్లాడిన షకీలా.. తాను ఆరంభంలో ఓ వ్యక్తిని ప్రేమించిందట. అతని వలన ప్రగ్నెంట్ కాగా, దానిని వాళ్ల అమ్మ తీయించేసిందట. తాను ప్రగ్నెంట్ అయిన విషయాన్ని చాలా లేట్‌గా పసిగట్టామని షకీలా పేర్కొంది.
రోజు రోజుకి తన పొట్ట పెరగడం చూసిన షకీలా మదర్ డాక్టర్ వద్దకి తీసుకెళ్లి పరీక్ష చేయించగా ప్రగ్నెంట్ అయినట్టు బయటపడింది. ఆ సమయంలో తనది పిల్లలు కనే వయస్సు కాకపోవడంతో తన తల్లి అబార్షన్ చేయించిందని షకీలా పేర్కొంది. ఒకవేళ తాను పిల్లల్ని కని ఉంటే బిడ్డలో లోపాలు ఉండేవేమో…మా అమ్మ అప్పుడు చేసిన పని సరైనదే అంటూ షకీలా స్పష్టం చేసింది.
ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. షకీలా ఇప్పటికీ తనని ప్రగ్నెంట్ చేసిన వ్యక్తితో టచ్‌లోనే ఉందట. షకీలా ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ ని దత్తత తీసుకొని వారే తన లోకంలా, జీవిస్తున్నట్టు ఇటీవల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షకీలా గ్లామర్ ఇమేజ్ నుండి బయట పడి అమ్మగా అనిపించుకోవడానికి ఆరాట పడుతుంది.
ఆ మధ్య 'కుక్ విత్ కోమలి' అనే వంటల ప్రోగ్రామ్ కూడా చేసి మెప్పించింది. ఆ తర్వాత కన్నడలో బిగ్ బాస్ షోలోనూ పాల్గొని సందడి చేసింది. బిగ్ బాస్ సీజన్7లో హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన రెండో కంటెస్టెంట్‌గా షకీలా నిలిచింది.
