విధాత: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఏఎస్ అధికారిణి శాంతికుమారిని సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం ఆదేశాల మేరకు జీఏడీ కార్యదర్శి వి. శేషాద్రి బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెలువడిన వెంటనే శాంతికుమారి ప్రగతి భవన్‌కు చేరుకొని సీఎం కేసీఆర్‌ను కలిశారు.
తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి pic.twitter.com/QYnlVTWP4p
— vidhaathanews (@vidhaathanews) January 11, 2023
ప్రస్తుతం ఆమె అటవీ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎస్‌గా నియమితులైన శాంతికుమారి బాధ్యతలు స్వీకరించారు. గతంలో శాంతికుమారి సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి 2025 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకు ఆమె సీఎస్‌గా కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు.
శాంతి కుమారి మృధుస్వభావిగా, పాలానాధికారం నెరపడంలో నేర్పరిగా పేరున్నది. ఈమె ఏపీ వాసి కావటం, ఆమె సామాజిక వర్గం, బీఆర్ఎస్ ఏపీలో విస్తరించటం అనే అంశాలు శాంతి కుమారికి అదనపు ప్రాధాన్యతను కల్పించడంలో కలిసి వస్తుందని అనుకుంటున్నారు.
ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్ల పాటు పనిచేశారు.
గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్నారు.
మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శాంతి కుమారి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శాంతి కుమారి మెదక్ ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 1999 నుండి 2001 వరకు అదనపు కలెక్టర్ గా, కలెక్టర్‌గా శాంతి కుమారి బాధ్యతలు నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, విద్యా, వైద్యం, అటవీ శాఖ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టి పని చేశారు. మెదక్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీమతి శాంతి కుమారి నేటి మధ్యాహ్నం బీఆర్కేఆర్ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు.
1989 batch IAS offcer, Smt. A. Santhi Kumari has assumed the charge as the new Chief Secretary at BRKR Bhavan today afternoon. pic.twitter.com/y3QlzaWDHT
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) January 11, 2023