Sharad Pawar బీజేపీపై ప్రజల మనసులలో వ్యతిరేకత ఇదిలా కొనసాగితే ఫలితాలు తారుమారు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ వ్యాఖ్యలు విధాత: బీజేపీ పట్ల ప్రజల మనసులలో ఉన్న వ్యతిరేకత ఇలానే కొనసాగితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మార్పు కనిపిస్తుందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌పవార్‌ చెప్పారు. ‘ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. బీజేపీకి వ్యతిరేకంగా గాలి వీస్తున్నదని నాకు అనిపిస్తున్నది. కర్ణాటక ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రజలు మార్పు కావాలనే భావనలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇదే […]

Sharad Pawar

  • బీజేపీపై ప్రజల మనసులలో వ్యతిరేకత
  • ఇదిలా కొనసాగితే ఫలితాలు తారుమారు
  • ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ వ్యాఖ్యలు

విధాత: బీజేపీ పట్ల ప్రజల మనసులలో ఉన్న వ్యతిరేకత ఇలానే కొనసాగితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మార్పు కనిపిస్తుందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌పవార్‌ చెప్పారు. ‘ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. బీజేపీకి వ్యతిరేకంగా గాలి వీస్తున్నదని నాకు అనిపిస్తున్నది. కర్ణాటక ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రజలు మార్పు కావాలనే భావనలో ఉన్నట్టు కనిపిస్తున్నది.

ఇదే భావన ప్రజల మనసులలో కొనసాగితే.. రానున్న ఎన్నికల్లో మార్పు కనిపిస్తుంది. ఇది చెప్పడానికి ఎలాంటి జోతిష్యులు అవసరం లేదు’ అని ఆయన చెప్పారు. రాబోయే మూడు నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెడతామని రాహుల్‌ అమెరికాలో పేర్కొన్న మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మిజోరం రాష్ట్ర అసెంబ్లీలకు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నికలు జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకలో బీజేపీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు భావ సారూప్యం ఉన్న పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఈ విషయంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

గత కొద్ది నెలల కాలంలో కాంగ్రెస్‌ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులతో ఆయన సమావేశాలు జరిపారు. జూన్‌ 12న ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలనుకున్నా.. అది వాయిదా పడింది. జూన్‌ 23న సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి.

బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు మరికొన్ని పార్టీలు కూడా విడిగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను కూడా ఈ కూటమిలోకి తేవడం క్లిష్టతరంగా మారింది.

Updated On 7 Jun 2023 3:03 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story