ఆశీర్వదించిన చెర్రీ దంపతులు
విధాత: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన శర్వానంద్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. గురువారం నాడు శర్వానంద్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డితో శర్వానంద్ ఎంగేజ్మెంట్ గురువారం జరిగింది. రక్షితా రెడ్డి యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన వీరి నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, సన్నిహితులు, ఫ్రెండ్స్ హాజరయ్యారు. శర్వానంద్ క్లాస్మేట్, బాల్య స్నేహితుడైన రామ్‌చరణ్ కూడా భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరై శర్వానంద్ – రక్షిత జంటను ఆశీర్వదించారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ ఫ్యాన్స్ ఆ ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక శర్వానంద్, రక్షిత పెళ్లి తేదీ త్వరలోనే వెల్లడి కానుంది. టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో రాశీఖన్నా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.