Nawaz Sharif విధాత: కోర్టు శిక్ష నుంచి తప్పించుకుని లండన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో తలదాచుకుంటున్న పాక్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ మేరకు పాక్ ప్రధాని, ఆయన సోదరుడు షెహబాజ్ షరీఫ్ మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 21న నవాజ్ పాక్‌లో అడుగుపెడతారని తెలిపారు. ఇమ్రాన్ అరెస్టు కావడం, అతడు ఇక ఎన్నికల్లో పోటీగా నిలిచే అవకాశం దాదాపుగా లేకపోవడం, తమ పార్టీకి సైన్యం తోడ్పాటు ఇస్తుండటంతో […]

Nawaz Sharif
విధాత: కోర్టు శిక్ష నుంచి తప్పించుకుని లండన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో తలదాచుకుంటున్న పాక్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ మేరకు పాక్ ప్రధాని, ఆయన సోదరుడు షెహబాజ్ షరీఫ్ మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 21న నవాజ్ పాక్‌లో అడుగుపెడతారని తెలిపారు.
ఇమ్రాన్ అరెస్టు కావడం, అతడు ఇక ఎన్నికల్లో పోటీగా నిలిచే అవకాశం దాదాపుగా లేకపోవడం, తమ పార్టీకి సైన్యం తోడ్పాటు ఇస్తుండటంతో నవాజ్‌కు అవినీతి కేసుల నుంచి శిక్ష పడే ముప్పు తప్పిందని నిపుణులు భావిస్తున్నారు. ఆయన రావడమే కాకుండా త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రచారానికి నేతృత్వం వహిస్తారని ఇప్పటికే షెహబాజ్ ప్రకటించారు.
నవంబరు 2019 నుంచి లండన్‌లోనే ఉంటున్న ఆయనను తాజాగా షెహబాజ్ కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీఎంఎల్ ఎన్ పార్టీకి చెందిన అగ్ర నేతలూ పాల్గొన్నట్లు సమాచారం. ఆయన రాకకు సంబంధించి అధకారిక తేదీపై స్పష్టత రావడంతో పలువురు పీఎంఎల్ ఎన్ నేతలు ఎక్స్‌లో సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
నవాజ్‌కు ఘన స్వాగతం పలుకుతామని ఆ పార్టీ సమాచార విభాగం కార్యదర్శి పోస్ట్ చేశారు. అల్ అజీజియా మిల్స్ అనే కేసులో ఆక్రమణలు పాల్పడినందుకు నవాజ్‌కు ఏడేళ్ల కారాగార శిక్ష పడింది. ఆ శిక్షను అనుభవిస్తూనే అనారోగ్య సమస్యల దృష్ట్యా లండన్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాల్సి ఉందని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనుమతి రావడంతో లండన్ వెళ్లిన నవాజ్ అక్కడే ఉండిపోయారు.
