Bigg Boss7 | బిగ్ బాస్ సీజ‌న్7 ఈ సారి 14 మంది స‌భ్యుల‌తో మొద‌లు కాగా, ఇందులో హీరో శివాజి అంద‌రి క‌న్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్. ఇత‌ను హౌజ్‌లో చాలా పెద్ద‌రికంగా ఉంటారు అనుకుంటే తాజాగా వీరంగం సృష్టించారు. ప‌చ్చిబూతులు మాట్లాడుతూ హౌజ్ ర‌ణ‌రంగంలా మారేలా చేశారు. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. ప్ర‌తి సీజ‌న్‌లో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి కాఫీ పౌడర్, టీ పౌడర్ వంటివి బిగ్ బాస్ పంపిస్తుండ‌డం మ‌నం […]

Bigg Boss7 |

బిగ్ బాస్ సీజ‌న్7 ఈ సారి 14 మంది స‌భ్యుల‌తో మొద‌లు కాగా, ఇందులో హీరో శివాజి అంద‌రి క‌న్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్. ఇత‌ను హౌజ్‌లో చాలా పెద్ద‌రికంగా ఉంటారు అనుకుంటే తాజాగా వీరంగం సృష్టించారు. ప‌చ్చిబూతులు మాట్లాడుతూ హౌజ్ ర‌ణ‌రంగంలా మారేలా చేశారు. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు.

ప్ర‌తి సీజ‌న్‌లో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి కాఫీ పౌడర్, టీ పౌడర్ వంటివి బిగ్ బాస్ పంపిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సీజ‌న్‌లో మాత్రం టీ పౌడ‌ర్ మాత్ర‌మే పంపాడు. కాఫీ అల‌వాటు ఉన్న శివాజీ తొలి రోజు కాఫీ పౌడ‌ర్ అడుగుతూనే ఉన్నాడు. అయిన పంప‌క‌పోయేస‌రికి కోపంతో ఊగిపోయాడు శివాజీ.

కిచెన్‌లో ఉన్న శివాజి .. ‘కాఫీ పంపవయ్యా బొక్కలోది’ అంటూ చేతిలో ఉన్న ప్లేట్‌ని విస‌ర‌గొట్ట‌గా అందరు ఉలిక్కిప‌డ్డారు. అయితే కిర‌ణ్ రాథోడ్ క‌ల్పించుకొని కాఫీ అనేది లగ్జరీ బడ్జెట్ కదా.. మనమే సంపాదించు కోవాలి అని అనడంతో.. ‘బొక్కలో బడ్జెట్’ అంటూ మండిప‌డ్డాడు. ఆ త‌ర్వాత త‌న ఎదురుగా ఉన్న బ‌కెట్ ని కాలితో తన్నాడు. నేను ఎవ‌డికి బొక్క కూడా బ‌యప‌డ‌నని అన్నారు.

అయితే అస‌లే ఆవేశంతో ఊగిపోతున్న శివాజీకి మ‌రింత బీపీ పెంచేలా కాఫీ పౌడ‌ర్ పంప‌కుండా బీపీ మెషీన్ పంపించి హౌస్‌లో ఉన్న‌ డాక్టర్ గౌతమ్‌ని బీపీ చెక్ చేసి అప్డేట్ ఇవ్వ‌మ‌ని సెటైర్ వేశాడు. దీంతో శివాజీకి మ‌రింత చిర్రెత్తుకొచ్చి.. ‘ఏయ్ నువ్వు నా బీపీ చూసేది ఏంటి?? పెట్టక్కడా’ అని గౌతమ్‌పై ఓ రేంజ్‌లో ఊగిపోయారు శివాజీ.

ఆ త‌ర్వాత స్టెతస్కోప్ పంపించి.. శివాజీ హార్ట్ బీట్ చెక్ చేయమని రతికాతో చెప్ప‌గా, అప్పుడు కూడా శివాజి చాలా కోపోద్రిక్తురాల‌య్యాడు. రతిక చేతిలో ఉన్న స్టెతస్కోప్ లాక్కుని విసిరిపారేశాడు. ‘నేనిక్కడ బాధపడుతుంటే కామెడీగా ఉందా? శివాజీగాడ్ని పిచ్చోడ్ని చేద్దాం అనుకుంటున్నాడా? ఏయ్ బిగ్ బాస్ తలుపుతియ్.. నేను పోతా.. నాకిదొద్దు’ అంటూ నానా ర‌చ్చ చేశాడు. మరి ఇది నిజ‌మేనా, సీక్రెట్ టాస్క్‌లో బాగ‌మా అన్న‌ది తెలియాలి.

ఇక ప్రియాంక, సందీప్ బీస్ట్ తో పోటీపడి కంటెండర్స్ గా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే మూడవ పోటీదారుడిగా బిగ్ బాస్‌ని ఇంప్రెస్ చేసిన వాళ్లు నిలుస్తారు. ఈ క్ర‌మంలో ఎవ‌రికి వారు అద్భుతమైన ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకి గాఢ ప్రేమికులుగా రతిక, పల్లవి ప్రశాంత్ మారుతున్న నేప‌థ్యంలో బిగ్ బాస్.. ప్రశాంత్ గుండె ఏమని కొట్టుకుంటుందో చెక్ చేయాలని అనడంతో న‌వ్వులు పూశాయి. ఏదేమైన తాజా ఎపిసోడ్ ర‌క్తి క‌ట్టించింది,

Updated On 8 Sep 2023 8:14 AM GMT
sn

sn

Next Story