Cheekoti | విధాత: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ మంగళవారం బీజేపీలో చేరేందుకు తన అనుచరులతో భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలిరాగా బీజేపీ పెద్దలు అందుబాటులో లేకుండా పోవడంతో చేరిక వాయిదా పడింది. చికోటి రాకకు ముందే బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. చికోటి చేరిక తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఇదే రోజు ఈటల రాజేందర్ సమక్షంలో మాజీ మంత్రి చందూలాల్ కొడుకు, […]

Cheekoti |

విధాత: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ మంగళవారం బీజేపీలో చేరేందుకు తన అనుచరులతో భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలిరాగా బీజేపీ పెద్దలు అందుబాటులో లేకుండా పోవడంతో చేరిక వాయిదా పడింది. చికోటి రాకకు ముందే బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. చికోటి చేరిక తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు.

ఇదే రోజు ఈటల రాజేందర్ సమక్షంలో మాజీ మంత్రి చందూలాల్ కొడుకు, ములుగు నేత ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. ఆయనకు ఈటల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చీకోటి చేరిక ఆకస్మికంగా వాయిదా పడటంతో ఆయన అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొన్న మాజీమంత్రి కృష్ణ యాదవ్‌, నేడు చికోటి ప్రవీణ్‌ల చేరికలు చివరి నిమిషంలో వాయిదా పడిన తీరు చేరికల వ్యవహారానికి ప్రతికూలంగా మారింది.

Updated On 13 Sep 2023 7:17 AM GMT
krs

krs

Next Story