Delhi | Tajpuria దేశ రాజ‌ధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో మంగ‌ళ‌వారం గ్యాంగ్‌స్ట‌ర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం విదిత‌మే. టిల్లు హ‌త్య‌కు సంబంధించిన ఓ వీడియో విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్ల్ వైర‌ల్ అవుతోంది. గ్యాంగ్‌స్ట‌ర్ టిల్లు ప్ర‌త్య‌ర్థి గ్యాంగ్‌స్ట‌ర్ జితేంగ‌ర్ గోగి అనుచ‌రులు కూడా ఓ కేసులో తీహార్ జైల్లోనే శిక్ష అనుభ‌విస్తున్నారు. అయితే మంగ‌ళ‌వారం ఉద‌యం టిల్లును త‌న సెల్‌ను నుంచి బ‌య‌ట‌కు లాక్కొచ్చారు గోగీ అనుచ‌రులు. […]

Delhi | Tajpuria

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో మంగ‌ళ‌వారం గ్యాంగ్‌స్ట‌ర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం విదిత‌మే. టిల్లు హ‌త్య‌కు సంబంధించిన ఓ వీడియో విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్ల్ వైర‌ల్ అవుతోంది.

గ్యాంగ్‌స్ట‌ర్ టిల్లు ప్ర‌త్య‌ర్థి గ్యాంగ్‌స్ట‌ర్ జితేంగ‌ర్ గోగి అనుచ‌రులు కూడా ఓ కేసులో తీహార్ జైల్లోనే శిక్ష అనుభ‌విస్తున్నారు. అయితే మంగ‌ళ‌వారం ఉద‌యం టిల్లును త‌న సెల్‌ను నుంచి బ‌య‌ట‌కు లాక్కొచ్చారు గోగీ అనుచ‌రులు. అనంత‌రం తాజ్‌పురియాపై ఆ న‌లుగురు క‌లిసి ప‌దునైన ఆయుధాల‌తో దాడి చేశారు.

త‌ల‌, ముఖం, మెడ‌పై విచ‌క్ష‌ణార‌హితంగా 90 సార్లు క‌త్తుల‌తో పొడిచి చంపారు. అప్ర‌మ‌త్త‌మైన జైలు సిబ్బంది.. టిల్లును ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు నిర్ధారించారు. అయితే క‌త్తుల‌తో పొడిచి చంపిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో.. అది ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తాజ్‌పురియాను హ‌త్య చేసిన వారిలో జితేంగ‌ర్ అనుచ‌రులు దీప‌క్ అలియాస్ తితార్, యోగేశ్ అలియాస్ తుండా, రాజేశ్‌, రియాజ్ ఖాన్ ఉన్నారు. ఈ న‌లుగురు క‌లిసి టిల్లుపై 92 సార్లు క‌త్తుల‌తో పొడిచి చంపారు. అయితే ఈ న‌లుగురు నిందితులు జైల్లోని మొద‌టి అంత‌స్తులో ఉంటున్నారు. కింది అంత‌స్తులో తాజ్‌పురియా ఉంటున్నాడు.

తాజ్‌పురియాను చంపాల‌ని నిర్ణ‌యించుకున్న గోగి గ్యాంగ్.. త‌మ సెల్ కిటీకి గ్రిల్స్‌ను తొల‌గించి, అదే రాడ్‌, బెడ్ షీట్ సహాయంతో కింది ఫ్లోర్‌లోకి దిగి, టిల్లు సెల్‌లోకి ప్ర‌వేశించారు. అత‌న్ని బ‌య‌ట‌కు లాక్కొచ్చి క‌త్తుల‌తో పొడిచి చంపిన‌ట్లు పేర్కొన్నారు. 2021లో రోహిణి కోర్టులో జితేంగ‌ర్‌పై టిల్లు కాల్పులు జ‌రిపి చంపేశాడు. ఈ కేసులోనే టిల్లు తీహార్ జైల్లో శిక్ష అనుభ‌విస్తున్నాడు.

Updated On 5 May 2023 8:56 AM GMT
subbareddy

subbareddy

Next Story