Home Guard Ravinder | హోంగార్డు జేఏసీ ప్రధాన కార్యదర్శి పాకాల రాజశేఖర్ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విధాత, హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని హోంగార్డు జేఏసీ ప్రధాన కార్యదర్శి పాకాల రాజశేఖర్ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల (సెప్టెంబర్) 5న ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన హోంగార్డు రవీందర్ అపోలో డీఆర్‌డీవో దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీనిపై మృతుడు […]

Home Guard Ravinder |
- హోంగార్డు జేఏసీ ప్రధాన కార్యదర్శి పాకాల రాజశేఖర్
- తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్
విధాత, హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని హోంగార్డు జేఏసీ ప్రధాన కార్యదర్శి పాకాల రాజశేఖర్ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈనెల (సెప్టెంబర్) 5న ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన హోంగార్డు రవీందర్ అపోలో డీఆర్‌డీవో దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీనిపై మృతుడు రవీందర్ కుటుంబ సభ్యులు, హోంగార్డు జేఏసీ నేతలు, పలువురు రాజకీయ నేతలు ఆందోనళకు దిగారు.
మృతుడి కుటుంబానికి ప్రభుత్వ అన్ని రకాలుగా ఆదుకోవాలని తెలంగాణ హైకోర్టులో హోంగార్డు జేఏసీ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. రవీందర్ మృతికి కారణమైన కానిస్టేబుల్ చందు, ఎస్సె నర్సింగరావు, కమాండెంట్ భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.
