Skin Care Tips | బేకింగ్‌ సోడా.. వంటింట్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. దీంతో చర్మవ్యాధుల నుంచి బయటపడొచ్చు. సరైన పద్ధతిలో ఎలా వినియోగించాలో తెలుసుకునే అనేక చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బేకింగ్ సోడాను ముఖానికి అప్లై చేసుకుంటే మొటిమలు, మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్ సమస్య నుండి బయటపడవచ్చు. మరి ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.. పాలు, బేకింగ్ సోడా.. బేకింగ్ సోడాను పాలతో కలిపి అప్లై […]

Skin Care Tips | బేకింగ్‌ సోడా.. వంటింట్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. దీంతో చర్మవ్యాధుల నుంచి బయటపడొచ్చు. సరైన పద్ధతిలో ఎలా వినియోగించాలో తెలుసుకునే అనేక చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బేకింగ్ సోడాను ముఖానికి అప్లై చేసుకుంటే మొటిమలు, మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్ సమస్య నుండి బయటపడవచ్చు. మరి ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..

పాలు, బేకింగ్ సోడా..

బేకింగ్ సోడాను పాలతో కలిపి అప్లై చేస్తే వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. రెండింటినీ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత నీళ్లతో కడిగేస్తే చర్మం మెరుస్తుంది. ఇలా తరుచూ చేస్తూ వస్తే.. ముఖంపైనున్న మురికిని, డార్క్‌నెస్‌ను తగ్గుతుంది.

నిమ్మకాయతో..

బేకింగ్ సోడాను నిమ్మకాయతో అప్లై చేస్తే ట్యానింగ్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. సుమారు పది నిమిషాల తర్వాత నీటితో కడగాలి. దీంతో ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.

అలోవెరాతో కలిపి..

అలోవెరా చర్మం ఆరోగ్యంలో చాలా మంచిది. దీన్ని బేకింగ్ సోడాతో కలిపి అప్లై చేయడం వల్ల టర్బిడిటీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. అలోవెరా జెల్, బేకింగ్ సోడా సమాన పరిమాణంలో తీసుకొని.. అందులో కాస్త నిమ్మరసం యాడ్‌ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి. చర్మం మెరిసిపోతుంది.

కొబ్బరినూనెతో..

బేకింగ్ సోడా ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కొబ్బరినూనెతో దీన్ని అప్లై చేయడం వల్ల చర్మానికి చాలా మేలు జరుగుతుంది. బేకింగ్ సోడాలో కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి ఈ పేస్ట్‌ని ముఖానికి బాగా పట్టించాలి. కొంత సమయం తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

Updated On 2 Feb 2023 6:35 AM GMT
Vineela

Vineela

Next Story