Tuesday, January 31, 2023
More
    Homelatestశృతి‌తో ఎఫైర్: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని

    శృతి‌తో ఎఫైర్: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని

    విధాత: దర్శకునిగా గోపీచంద్ మలినేని యంగ్ డైరెక్టర్‌గా తన సత్తాను చాటుకుంటూ వెళుతున్నాడు.. వరుస విజయాలు సాధిస్తూ ఉన్నాడు. ఆయ‌న మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన డాన్ శీను చిత్రంతో పరిశ్రమకు డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు.

    ఆ తరువాత వెంకటేష్‌తో బాడీగార్డ్, సాయి ధరమ్ తేజ్‌తో విన్నర్, రవితేజతో క్రాక్, బలుపు.. రామ్‌తో పండగ చేసుకో, నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి వంటి సినిమాలు చేశాడు. గోపీచంద్ తీసిన చిత్రాలు ఏడు. వీటిలో నాలుగు చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి. వీటిలో మూడు చిత్రాలలో శృతిహాసనే హీరోయిన్‌.

     

    ‘బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి’లలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇక సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత రూమర్స్ సర్వసాధారణం. అలా గోపీచంద్ మ‌లినేనిపై కూడా రీసెంట్‌గా ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వీరసింహారెడ్డి విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్స్‌లో శృతిహాసన్ కి అందరి ముందు గోపీచంద్ మలినేని ఐ లవ్ యు చెప్పాడు. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం వీళ్లిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు మీమ్స్ చేసి రచ్చ చేసేశారు.

    దీనిపై గోపీచంద్ మలినేని స్పష్టత ఇస్తూ.. శృతిహాసన్‌కు నాకూ ఉన్నది అన్నా చెల్లెలి అనుబంధం. నేను ఆ ఉద్దేశంతోనే ఆమెకి ఐ లవ్ యు చెప్పాను. కానీ సోషల్ మీడియాలో మన గాసిప్ రాయుళ్లు దానిని వేరే ఉద్దేశంతో మార్చి మీమ్స్ చేశారు. అవి చూసి నేను శృతిహాసన్ బాగా నవ్వుకున్నాము అంటూ సమాధానం చెప్పాడు. దీంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కి ఆయన చెక్ పెట్టినట్లైంది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular