Tuesday, January 31, 2023
More
  Homelatestతండ్రి వయసు వారితో సరసాలు.. శృతిహాసన్ కౌంటర్

  తండ్రి వయసు వారితో సరసాలు.. శృతిహాసన్ కౌంటర్

  విధాత: ప్రస్తుతం అందరి దృష్టి సంక్రాంతికి విడుదల కాబోతున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’లపైనే ఉంది. ఈ రెండు చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరో విశేషమేమిటంటే ఈ రెండు చిత్రాలలోనూ అటు చిరంజీవి, ఇటు బాలయ్య సరసన యంగ్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది. ఇద్ద‌రితో క‌లిసి రొమాన్స్ చేస్తూ స‌ర‌సాలాడ‌నుంది. మూడు పదుల వయసున్న శృతిహాసన్ ఆరు పదులు దాటిన చిరు, బాలయ్యలతో కలిసి సరసాలు ఆడటం ఏమిటి? అని కొంతమంది నుండి విమర్శలు వ‌స్తున్నాయి.

  కేవలం డబ్బుల కోసమే శ్రుతిహాసన్ ఇలా సీనియర్ స్టార్స్ స‌ర‌స‌న జోడి కడుతుందనే వారు కూడా ఉన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్లు తమ మనవరాలు వయసున్న శ్రీదేవి వంటి వారితో కూడా జత కట్టిన విషయం తెలిసిందే. ఇక విషయానికి వస్తే సోషల్ మీడియా యుగంలో ప్రతి విషయాన్ని తప్పు పట్టేందుకు కొందరు రెడీగా ఉంటారు. నెగెటివ్ యాటిట్యూడ్‌తో బతికే జనాలు శృతిహాసన్‌ను ట్రోల్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. సీనియర్స్ కావడంతో డబ్బుల కోసం తండ్రి వయసు ఉన్న హీరోలతో సినిమాలు చేస్తున్నావా? నీకు ఆఫర్స్ లేవా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. వీటిపై శృతి ఘాటుగానే స్పందించింది.

  చిత్ర పరిశ్రమలో ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమే. గతంలో నాకంటే ముందు అనేక మంది హీరోయిన్స్ తమ కంటే డబుల్ వయసున్న హీరోలతో క‌లిసి నటించారు. అందుకు నేనేమీ అతీతం కాదంటూ సమాధానం ఇచ్చింది. ఇక శృతిహాసన్ తండ్రి కమలహాసన్ వయసుకు కాస్త అటు ఇటుగానే బాలయ్య, చిరుల వయసు కూడా ఉంటుంది. వారందరూ దాదాపు ఒకే జనరేషన్‌కు చెందినవారు. అందుకే ఈ పోలిక వచ్చింది.

  నిజం చెప్పుకోవాలంటే శృతి కెరీర్‌కు ఈమధ్య పెద్ద బ్రేక్ పడింది. సినిమాలపై దృష్టి సారించక పోవడంతో ఆమె ఫేడవుట్ అయ్యి కొంతకాలం వెండితెరకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సమయంలో ఆమె కెరీర్ డౌన్ అయింది. ప్రేమలు, సహజీవనాల పేరుతో త‌న కెరీర్‌ని పాడు చేసుకుంది. స్టార్‌గా వెలిగి పోతున్న రోజుల్లో లవ్ ఫెయిల్ కారణంగా పరిశ్రమకు దూరమైంది. 2017 తర్వాత ఆమెకు గ్యాప్ వచ్చింది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా ఆమెను పక్కన పెట్టేశారు.

  ప్రస్తుతం ఆమెకు వేరే ఆప్షన్ లేదు. ఏదో రవితేజ, చిరంజీవి, బాలకృష్ణ వంటి కాస్త వ‌య‌సున్న హీరోలతో చేసుకుంటూ సర్దుకుపోతోంది. ఎందుకంటే ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఆమెకు ఆఫర్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే అదే సమయంలో ఆమెకు ప్రబాస్ సరసన ఏకంగా సలార్ వంటి పాన్ ఇండియా చిత్రంలో అవకాశం రావడం అద్భుతం అని చెప్పాలి.

  ప్రశాంత్ నీల్ హీరోయిన్ల ఎంపికలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆయనకు హీరోయిన్లను ఎంచు కోవడం చేత‌కాదనే ట్రోల్స్ కూడా వచ్చాయి. ప్రభాస్ సరసన ఫేడవుట్ అయిన శృతిహాసన్ ను పాన్ ఇండియా మూవీలో పెట్టుకోవడంపై ప్రభాస్ అభిమానులు కూడా మండిపడ్డారు. ఏ మాత్రం ఫామ్‌లో లేని శృతికి అసలు ఛాన్స్ ఎలా ఇచ్చారు? అని అంటున్నారు. సలార్ ఎలాంటి ఫలితం అందుకున్న శృతికి రాబోయే కాలంలో ఆఫర్స్ కష్టమే.

  ఇక ఆమె భవిష్యత్ ప్రాజెక్టు కూడా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, సలార్ విజయాల మీదనే ఆధారపడి ఉంటుంది. వీరయ్య, వీర సింహారెడ్డి హిట్ అయితే మరిన్ని సినిమాలలో సీనియర్ల సరసన అవకాశాలు వస్తాయి. సలార్‌ హిట్ అయితే అప్పుడు ఆమె మరలా యంగ్ స్టార్స్ దృష్టిలో పడే అవకాశం వస్తుంది. మరి ఆమె భవిష్యత్తు ఎలా ఉండనుందో ఈ మూడు సినిమాలు తేల్చ‌నున్నాయి.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular