విధాత : రాష్ట్రంలోని పోలీసు శాఖ‌లో ఖాళీగా ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి గ‌త కొద్ది రోజుల క్రితం ప్రాథ‌మిక ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప్రాథ‌మిక ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు క‌స‌ర‌త్తు చేప‌ట్టింది. ఫ‌లితాల విడుద‌ల ప్ర‌క్రియ ఓ కొలిక్కి రావ‌డంతో ఈ వారంలోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చ‌ర్యలు చేప‌ట్టింది. ఆగ‌స్టు 7, 28 తేదీల్లో […]

విధాత : రాష్ట్రంలోని పోలీసు శాఖ‌లో ఖాళీగా ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి గ‌త కొద్ది రోజుల క్రితం ప్రాథ‌మిక ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప్రాథ‌మిక ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు క‌స‌ర‌త్తు చేప‌ట్టింది. ఫ‌లితాల విడుద‌ల ప్ర‌క్రియ ఓ కొలిక్కి రావ‌డంతో ఈ వారంలోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చ‌ర్యలు చేప‌ట్టింది.


ఆగ‌స్టు 7, 28 తేదీల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌కు ప్రాథ‌మిక ప‌రీక్ష నిర్వ‌హించారు. సెప్టెంబ‌ర్‌లోనే ఫ‌లితాల‌ను విడుదల చేస్తామ‌ని బోర్డు ప్ర‌క‌టించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కుల్ని తగ్గిస్తామని సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించడంతో బోర్డు ముందుకు వెళ్ల‌లేక‌పోయింది.


సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో బీసీ అభ్య‌ర్థుల‌కు 50కి, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్య‌ర్థుల‌కు 40 మార్కుల‌కు క‌టాఫ్ నిర్ణ‌యిస్తూ ఈ నెల 2న ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఓపెన్ కేట‌గిరి అభ్య‌ర్థుల‌కు క‌టాఫ్ మార్కుల‌ను యథాతథంగా 60గానే ఉంచాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వులతో తగ్గించిన కటాఫ్‌ మార్కులకు అనుగుణంగా ఫలితాల వెల్లడిపై మండలి కసరత్తు ముమ్మరం చేసింది. ఈమేరకు 554 ఎస్సై పోస్టులకు పరీక్ష రాసిన 2,47,217 మంది.. 16,321 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులకు పరీక్షకు హాజరైన 6,03,955 మంది అభ్యర్థుల నిరీక్షణకు ఈ వారంలోనే తెరపడనుంది.


ఫ‌లితాల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో ఫిజికల్ ఎఫిషియెన్సీ, మెజ‌ర్‌మెంట్ ప‌రీక్ష‌ల అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఈ ప‌రీక్ష‌ల‌ను న‌వంబ‌ర్‌లో నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. మొద‌ట‌గా ప‌రుగు పందెం పోటీలను నిర్వ‌హించి, అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ప‌రుగు పందెంలో పురుషులు 1600 మీట‌ర్లు, మ‌హిళ‌లు 800 మీట‌ర్ల ప‌రుగును నిర్ణీత స‌మ‌యంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప‌రుగు పందెంలో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణించి మరోసారి హాల్‌టికెట్లను జారీ చేస్తారు.

Updated On 17 Oct 2022 7:11 AM GMT
subbareddy

subbareddy

Next Story