HomelatestSI Junmoni Rabha | రోడ్డుప్ర‌మాదంలో అసోం 'లేడీ సింగం' మృతి

SI Junmoni Rabha | రోడ్డుప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ మృతి

SI Junmoni Rabha |

లేడీ సింగం, దబాంగ్ కాప్‌గా పేరు తెచ్చుకున్న అసోం మ‌హిళా ఎస్ఐ జున్మ‌ణి ర‌భా రోడ్డుప్ర‌మాదంలో మృతి చెందారు. అసోంలోని నాగాన్ జిల్లా జ‌ఖ‌ల‌బాంధా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో జున్మ‌ణి ర‌భా ప్ర‌యాణిస్తున్న కారును ట్ర‌క్కు ఢీకొట్టింది. తీవ్ర గాయాల‌పాలైన జున్మ‌ణి ర‌భాను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.

మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్ట్ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్ఐ జున్మ‌న‌ణి రభా.. సోమవారం అర్ధరాత్రి తన ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్నారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఓ కంటైనర్‌ను రభా కారు ఢీకొట్టింది. జఖలబాంధా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరుబుగియా గ్రామంలో ఈ ప్ర‌మాదం జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సివిల్ డ్రెస్సులో ఉన్న ర‌భాను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గానే మార్గ‌మ‌ధ్య‌లోనే మృతి చెందింది. అయితే జున్మ‌ణి ర‌భా విధి నిర్వ‌హ‌ణ‌లో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరు ఉంది.

అంతే కాకుండా ప‌లు వివాదాల్లోనూ ఆమె చిక్కుకున్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొని గ‌తేడాది జూన్‌లో అరెస్టు అయిన జున్మ‌ణి.. కొంత‌కాలం పాటు స‌స్పెన్ష‌న్‌లో ఉన్నారు. ఇటీవ‌లే ఆమె డ్యూటీలో చేరారు.

రభా ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టగానే కంటైనర్ డ్రైవర్ పారిపోయాడు. ఈ ప్ర‌మాదానికి కొన్ని గంట‌ల ముందే జున్మ‌ణిపై దోపిడీ కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ప్ర‌మాదంపై అనుమానం వ్య‌క్తం చేస్తున్న ఆమె కుటుంబ స‌భ్యులు.. నిష్ఫక్ష‌పాతంగా ద‌ర్యాప్తు చేయాల‌ని డిమాండ్ చేశారు.

అయితే ప‌లు వ‌ర్గాల నుంచి వ‌స్తున్న డిమాండ్ల మేర‌కు ఈ కేసును సీఐడీకి బ‌దిలీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు అసోం డీజీపీ జ్ఞానేంద్ర ప్ర‌తాప్ సింగ్ తెలిపారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular