విధాత, నిజామాబాద్: రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న వరి ధాన్యం బస్తాలను ఓ SI స్వయంగా తొలగించడంపై ప్రశంశలు వెళ్లువెత్తాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ స్టేజీ వద్ద లారీ నుంచి వడ్ల బస్తాలు పడి పోయాయి.
అదే సమయంలో అటు వైపుగా వెళ్తున్న తాడ్వాయి SI ఆంజనేయులు స్వయంగా తానే వడ్ల బస్తాలు ఎత్తి రోడ్డు పక్కన వేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్తాల వద్ద ప్రమాదాలు జరుగుతాయని భావించి వాటిని పక్కకు వేసినట్లు SI ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో SIపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి