Siddipeta
- మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద ప్రమాదం
- సిద్దిపేట జిల్లా చౌటు పల్లికి చెందిన వారిగా గుర్తింపు
విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా అక్కన్న పేట మండలం చౌటు పల్లి కి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలు ఇలా వున్నాయి. సమీప బంధువు మరణించడంతో సూరత్ నుండి స్వగ్రామానికి వచ్చి అంత్యక్రియల అనంతరం గ్రామం నుండి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై మృతిచెందారు.
సూరత్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరగడంతో నలుగురు మృతి చెందిన విషయం తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది. చౌటు పల్లి గ్రామం నుండి ఉదయం కారులో సూరత్ కి వెళ్తుండగా ఔరంగాబాద్ లో ప్రమాదం జరిగినట్టు బంధువుల తెలిపారు.
మృతులు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎరుకల కృష్ణ, ఎరుకల సంజీవ్, ఎరుకల సురేష్, ఎరుకల వాసుగా గుర్తించారు.
బ్రతుకుతెరువు కోసం వెళ్లి సూరత్ లో స్థిరపడ్డ నలుగురు అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. స్వగ్రామంలో బంధువుల అంత్యక్రియలకు వచ్చి కారులో తిరిగి సూరత్ కు వెళ్తుండగా ఔరంగాబాద్ లో ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది…