విధాత: క్యాస్ట్ సమీకరణాల్లో కలిసొచ్చి మంత్రిగా ఎదిగిపోయిన ఫస్ట్ టైం ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఎంత గబుక్కున మంత్రి అయ్యారో అంతే గబుక్కున దిగిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి తొలిసారిగా నెగ్గి మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేసినా ఉన్నఫళంగా వచ్చి సీఎంను కలవాల్సిందిగా తాఖీదులు రావడంతో తాడేపల్లి బయల్దేరి వెళ్లారు. రెండు మూడు రోజుల్లో కేబినెట్లో మార్పులు చేస్తారని అందులో భాగంగా అప్పలరాజు పదవికి ఎసరు ఉంటుందా అని అంటున్నారు.
తొలిసారిగా మంత్రి అయిన ఆయన పదవికి ముప్పురాలేదు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయన పదవిపోలేదు. ఇపుడు ఉన్నట్లుండి సీఎం ఆఫీస్ నుంచి అర్జంట్ ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన తాడేపల్లికి బయల్దేరి వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావుతోబాటు అప్పలరాజు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు అప్పలరాజుని తప్పిస్తారు అని అంటున్నారు. మంత్రిగా ఆయన పనితీరు బాలేదని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఆయన మళ్ళీ పలాసలో గెలవడం కూడా కష్టమే అని అంటున్నారు. ఆయనకు టిక్కెట్ కూడా ఇవ్వరు అంటున్నారు.
ఇదిలా ఉంటె ఈమధ్య అప్పలరాజు మాట్లాడుతూ సామాజిక సమీకరణల నేపథ్యంలో అవసరం అయితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.