మహిళల్లో ఊపిరాడక పోవడం పురుషులలో ఛాతీలో నొప్పి ముందుగానే గుర్తించగలిగేతే ఆకస్మిక మరణాలను తగ్గించొచ్చు Heart attack | వాషింగ్టన్: గుండెపోటు రావడానికి 24 గంటల ముందు నుండే రకరకాల సంకేతాలు అందుతాయని, వాటిని పసిగట్టి, ముందుగా చికిత్స తీసుకుంటే అనవసర మరణాలను తగ్గించవచ్చని కాలిఫోర్నియాలోని సెడార్- సినాయ్ మెడికల్ సెంటర్‌కు చెందిన స్మిడ్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన తేల్చింది. ఈ పరిశోధన వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గుండెపోటు రెండు ప్రధాన సంకేతాలు స్త్రీ, పురుషుల్లో […]

- మహిళల్లో ఊపిరాడక పోవడం
- పురుషులలో ఛాతీలో నొప్పి
- ముందుగానే గుర్తించగలిగేతే
- ఆకస్మిక మరణాలను తగ్గించొచ్చు
Heart attack | వాషింగ్టన్: గుండెపోటు రావడానికి 24 గంటల ముందు నుండే రకరకాల సంకేతాలు అందుతాయని, వాటిని పసిగట్టి, ముందుగా చికిత్స తీసుకుంటే అనవసర మరణాలను తగ్గించవచ్చని కాలిఫోర్నియాలోని సెడార్- సినాయ్ మెడికల్ సెంటర్‌కు చెందిన స్మిడ్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన తేల్చింది. ఈ పరిశోధన వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గుండెపోటు రెండు ప్రధాన సంకేతాలు స్త్రీ, పురుషుల్లో విడివిడిగా ఉంటాయని ఆ నివేదిక తెలిపింది.
మహిళలో గుండెపోటుకు ముందు శ్వాస అందక పోవడం వంటి సంకేతాలు కనిపిస్తాయని, అదే మగవారిలో ఛాతీ నొప్పి ఉంటుందని ఈ పరిశోధన వెల్లడించింది. ఈ రెండు లక్షణాలే కాకుండా.. గుండె దడ, మూర్ఛ, ఫ్లూ మాదిరి లక్షణాలు, ఉన్నపళంగా చూపు మసకబారడం కూడా గుండెపోటుకు సంకేతాలని ఈ పరిశోధనలో పాల్గొన్న సుమీత్ ఛుగ్ వెల్లడించారు.
కాలిఫోర్నియాకు చెందిన ప్రిడిక్షన్ ఆఫ్ సడెన్ డెత్ ఇన్ మల్టీ- ఎత్నిక్ కమ్యూనిటీస్ (ప్రెస్టో) ఎనిమిదేళ్ళుగా నిర్వహించిన పరిశోధనతోపాటు, 22 ఏండ్ల పాటు కొనసాగిన ఆర్గాన్ –బేస్డ్ సడెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెత్ స్టడీ (ఎస్‌యూడీఎస్)లో సేకరించిన రోగుల డాటా ఆధారంగా తమ పరిశోధనను కొనసాగించామన్నారు. తమది ప్రపంచంలోనే మొదటి కమ్యూనిటీ ఆధారిత ఆధ్యయనమని స్మిడ్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఎడ్వర్డో మార్భాన్ వెల్లడించారు.
