Gold Rate | బంగారం, వెండి ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు ఊర‌ట‌నిస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా శుక్ర‌వారం దిగివ‌చ్చాయి. ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే ఆర్న‌మెంట్ బంగారం తులానికి రూ.150 దిగివ‌చ్చి రూ.55,700కు చేరింది. మ‌రో వైపు స్వ‌చ్ఛ‌మైన 24 క్యారెట్ల బంగారంపై రూ.170 త‌గ్గి రూ.60,760 చేరింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.55,850 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,930 ప‌లుకుతున్న‌ది. ముంబ‌యిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,700 ఉండ‌గా.. 24 క్యారెట్ల […]

Gold Rate | బంగారం, వెండి ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు ఊర‌ట‌నిస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా శుక్ర‌వారం దిగివ‌చ్చాయి. ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే ఆర్న‌మెంట్ బంగారం తులానికి రూ.150 దిగివ‌చ్చి రూ.55,700కు చేరింది.

మ‌రో వైపు స్వ‌చ్ఛ‌మైన 24 క్యారెట్ల బంగారంపై రూ.170 త‌గ్గి రూ.60,760 చేరింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.55,850 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,930 ప‌లుకుతున్న‌ది.

ముంబ‌యిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,700 ఉండ‌గా.. 24 క్యారెట్ల స్వ‌ర్ణం రూ.60,760 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది.

చెన్నైలో 22క్యారెట్ల బంగారం ధర రూ.56,200 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,310 వ‌ద్ద ట్రేడ‌వుతున్న‌ది.

ఇక హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700 ఉండ‌గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,760 ప‌లుకుతున్న‌ది. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంతో పాటు ప‌లు తెలుగు రాష్ట్రాలో ఇవే ధ‌ర‌లు కొన‌సాగుతున్నాయి.

మ‌రో వైపు వెండి ధ‌ర‌లు సైతం త‌గ్గుముఖం ప‌ట్టాయి. కిలో వెండిపై రూ.4వేలు త‌గ్గింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో కిలో రూ.77,600 ప‌లుకుతున్న‌ది.

Updated On 2 Jun 2023 6:32 AM GMT
Vineela

Vineela

Next Story