సింగర్ మంగ్లీ అనతి కాలంలోనే చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది. తన పాటలతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఈ సింగర్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు.
విధాత: శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయంలో మంగ్లీ ఆట, పాట ఈ వివాదానికి కారణమైంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని పది రోజుల కిందట దేవాలయంలో మంగ్లీ బృందం ఓ పాటను చిత్రీకరించింది. కాలభైరవ స్వామి వద్ద, అలాగే అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మంగ్లీ బృందం నృత్యాన్ని చిత్రీకరించింది. రాయల మండపం, రాహు కేతు మండపం, ఊంజల్ సేవ మండపాలలో మంగ్లీ బృందం ఆట పాట సాగింది.
అనుమతి ఎవరు ఇచ్చారు…?
మరి ఇక వివాదం ఎందుకు? అనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే చాలా ఏళ్లుగా దేవాలయం లోపల ఈ ప్రాంతాల్లో వీడియో చిత్రీకరణపై నిషేధం ఉన్నది. ఈ నిబంధనలకు విరుద్ధంగా మంగ్లీ బృందం షూట్ చేయడం తాజా వివాదానికి కారణమైంది. ఈ పాట చిత్రీకరణకు ఎవరు అనుమతి ఇచ్చారు?
తెల్లవారు జామున పాట చిత్రీకరణ..
నిషేధం ఉన్న చోట్ల షూటింగ్ ఎలా చేస్తారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే మంగ్లీ పాట కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి అనుమతులు పొందినట్లు సమాచారం. ఇది అధికారికంగా తెలియాల్సి ఉన్నది. తెల్లవారు జామున ఆలయంలో పాట చిత్రీకరణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ పాట చిత్రీకరణపై వివాదం ఉన్నప్పటికీ ఆ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం.
‘నీ రెజ్యూమ్ పంపు.. పనిమనిషిగా పెట్టుకుంటా’! అనసూయను ఆడేసుకున్న నెటిజన్