Singer Sunitha| విధాత: సింగర్ సునీత (Singer Sunitha) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ అదృష్టం లేకుండా చేసిన ఆయనని నిందిస్తూనే ఉంటానంటూ.. ఆమె చేసిన పోస్ట్‌పై నెటిజన్లు కూడా ఆమెకు వంత పాడుతున్నారు. ఇంతకీ ఆమె ఎందుకిలా పోస్ట్ చేసిందో తెలిస్తే.. ఎవ్వరైనా ఆమెకు సపోర్ట్ చేయక మానరు. అంతలా ఆమె బాధ పడుతోంది ఎవరి కోసమో కాదు.. గానగంధర్వుడు, దివంగత లెజెండ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం విషయంలో ఆమె దేవుడిని […]

Singer Sunitha|

విధాత: సింగర్ సునీత (Singer Sunitha) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ అదృష్టం లేకుండా చేసిన ఆయనని నిందిస్తూనే ఉంటానంటూ.. ఆమె చేసిన పోస్ట్‌పై నెటిజన్లు కూడా ఆమెకు వంత పాడుతున్నారు.

ఇంతకీ ఆమె ఎందుకిలా పోస్ట్ చేసిందో తెలిస్తే.. ఎవ్వరైనా ఆమెకు సపోర్ట్ చేయక మానరు. అంతలా ఆమె బాధ పడుతోంది ఎవరి కోసమో కాదు.. గానగంధర్వుడు, దివంగత లెజెండ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం విషయంలో ఆమె దేవుడిని నిందిస్తూ.. ఇలా పోస్ట్ చేసింది.

సునీత తన పోస్ట్‌లో.. ‘‘నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా.. పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పుకునే అదృష్టం లేకుండా చేసిన ఆ భగవంతుడ్ని ఈరోజుమాత్రం ఎప్పటికి నిందిస్తూనే ఉంటా..’’ అంటూ ఎస్.పి. బాలు జయంతిని పురస్కరించుకుని ఇన్‌స్టా వేదికగా ఆయనతో కలిసున్న ఒక ఫొటోని సింగర్ సునీత షేర్ చేసింది.

అంతేకాదు.. ఎస్.‌పి. బాలుతో తనకున్న మెమరీస్ అన్నింటిని కలిపి ఓ వీడియో చేసి యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియో, ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఆమె చేసిన పోస్ట్‌కు నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతూ.. ఎస్.పి. బాలుని తలచుకుంటున్నారు. ఆయన లేకపోయినా.. ఆయన పాటలు ఎప్పుడూ ఆయనని గుర్తు చేస్తూనే ఉంటాయని, ఆ పాట లేకుండా రోజుగడవదని.. ఇలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా సింగర్ సునీత దేవుడిపై అలకబూనినట్లుగా షేర్ చేసిన పోస్ట్‌కి అంతా ఫిదా అవుతున్నారు. ‘అక్కా..’ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ.. గానగంధర్వుడి విషయంలో నువ్వు పోస్ట్ చేసిన ప్రతి అక్షరం నిజమని అంటున్నారు.

Updated On 5 Jun 2023 9:33 AM GMT
krs

krs

Next Story