విదాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్నది. కర్ణాటక, హరియాణ, ఏపీ, హైదరాబాద్‌లో సోదాలు ముగిశాయి. కేరళలో సిట్‌ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు వస్తున్న విషయాన్ని తెలుసుకుని ఓ వైద్యుడు పరారయ్యాడు. ఆయన రామచంద్ర భారతికి సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. వైద్యుడి ఆశ్రమానికి వెళ్లి పర్యవేక్షకుడి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. వైద్యుడి ఇంటి చిరునామా కనుక్కుని అక్కడికి వెళ్లేలోపే వైద్యుడు పరారయ్యాడు. పోలీసులు వస్తున్నట్లు ఆలయ పర్యవేక్షకుడు వైద్యుడికి సమాచారం అందించాడు. కేరళ […]

విదాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్నది. కర్ణాటక, హరియాణ, ఏపీ, హైదరాబాద్‌లో సోదాలు ముగిశాయి. కేరళలో సిట్‌ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు వస్తున్న విషయాన్ని తెలుసుకుని ఓ వైద్యుడు పరారయ్యాడు. ఆయన రామచంద్ర భారతికి సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.

వైద్యుడి ఆశ్రమానికి వెళ్లి పర్యవేక్షకుడి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. వైద్యుడి ఇంటి చిరునామా కనుక్కుని అక్కడికి వెళ్లేలోపే వైద్యుడు పరారయ్యాడు. పోలీసులు వస్తున్నట్లు ఆలయ పర్యవేక్షకుడు వైద్యుడికి సమాచారం అందించాడు. కేరళ పోలీసుల సహాయంతో పర్యవేక్షకుడిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పరారైన వైద్యుడి కోసం గాలిస్తున్నారు.

Updated On 14 Nov 2022 6:07 AM GMT
krs

krs

Next Story