విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో న్యాయవాది ప్రతాప్‌గౌడ్ శనివారం మరోసారి విచారణకు హాజరు కానున్నారు. నిన్న ఆయనను సిట్ అధికారులు 8 గంటల పాటు విచారించారు. ఈ కేసులో మరో నిందితుడు నందకుమార్ గతంలో అంబర్‌పేటలో సీజన్స్ హోటల్ నడిపాడు.
అదే ప్రాంతానికి చెందిన న్యాయవాది ప్రతాప్‌గౌడ్ భారీగా డబ్బు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన కాల్ రికార్డు సిట్ స్వాధీనం చేసుకున్నది.
సోమవారం మరోసారి విచారణకు హాజరు కావాలని నందకుమార్ భార్యకు సిట్ తెలిపింది. సిట్ అధికారులు నిన్న నందకుమార్ భార్య చిత్రలేఖ సెల్‌ఫోన్‌ను తనిఖీ చేశారు. కోర్టు రిమాండ్ నిరాకరించడంతో నందకుమార్ ఇంట్లో రెండు రోజులు ఉండటంపై సిట్ ఆరా తీస్తున్నది