Cheetah | తిరుమలలో మెట్లమార్గంలో మరో ఆరో చిరుత చిక్కింది. ఇప్పటి వరకు ఐదు చిరుతలను అధికారులు బంధించగా.. ఇది ఆరోది. శ్రీవారి భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నడకమార్గంలో సంచరిస్తున్న చిరుతలను బంధించి.. వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నది. గత నెలలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల రోజుల వ్యవధిలో ఆరు చిరుతలను టీటీడీ పట్టుకున్నది. ఆగష్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత […]

Cheetah |

తిరుమలలో మెట్లమార్గంలో మరో ఆరో చిరుత చిక్కింది. ఇప్పటి వరకు ఐదు చిరుతలను అధికారులు బంధించగా.. ఇది ఆరోది. శ్రీవారి భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నడకమార్గంలో సంచరిస్తున్న చిరుతలను బంధించి.. వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నది. గత నెలలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల రోజుల వ్యవధిలో ఆరు చిరుతలను టీటీడీ పట్టుకున్నది. ఆగష్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత దాడి చేయడంతో చిరుతల్ని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ ఆపరేషన్ చిరుతను ప్రారంభించింది.

నాలుగు రోజుల కిందట చిరుత సంచారాన్ని గుర్తించిన అధికారులు దాన్ని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. నాలుగు రోజుల క్రితం గుర్తించిన అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో కొన్ని మెట్లమార్గం వైపునకు వస్తున్నాయి. గతేడాది జూన్‌ 22న కౌశిక్‌ అనే బాలుడిపై చిరుత దాడి చేసింది. దాన్ని చూసిన బంధువులు వెంట పడడంతో 500 మీటర్ల దూరంలో వదిలేసి పారిపోయింది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. నడకమార్గంలో చిరుతల సంచారాన్ని గుర్తించినా వాటిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు.

బాలుడిని నోట కరుచుకుని వెళ్లడంతో దాన్ని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. 24న మళ్లీ నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆగస్టు 11న నెల్లూరుకు చెందిన లక్షిత అనే బాలికను దాడి చేసి చంపేయడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత టీటీడీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. భక్తుల రక్షణ కోసం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో నడకమార్గంలోకి వస్తున్న చిరుతలను గుర్తించేందుకు ట్రాప్‌ కెమెరాలను అమరచ్చగా.. తొలిసారిగా 14న చిరుత చిక్కింది. అదే ప్రాంతంలో మరో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు.

ఆ తర్వా మరో రెండు చిరుతలను పట్టుకోగా.. నాలుగో చిరుత మాత్రం బోనులోకి రాకుండా వెళ్లిపోయింది. దాని కదలికలపై అధ్యయనం చేసిన తర్వాత.. దానికి ఆహారం చిక్కకుండా చేయడంతో చివరకు బోను వద్దకు ఆహారం కోసం వచ్చి చిక్కింది. 7న ఐదు చిరుతను.. తాజాగా బుధవారం మరోసారి ఆరో చిరుతను బంధించారు. ఇప్పటి వరకు నెల వ్యవధిలో ఆరు చిరుతలను టీటీడీ పట్టుకుంది. ఆగస్టులో పట్టుకున్న మూడు చిరుతలను ఎస్వీ జూ సంరక్షణలో ఉంచారు. అటవీ శాఖ పట్టుకున్న చిరుతల్లో రెండు చిరుతల్ని అటవీ శాఖ వదిలేసింది. ఇందులో ఒకదానికి దంతాలు లేకపోవడం, డీఎన్‌ఏ పరీక్షలపై బాలికపై దాడి చేయలేదని నిర్ధారణ కావడంతో వదిలేశారు.

Updated On 20 Sep 2023 4:29 AM GMT
cm

cm

Next Story