విధాత‌: ప్ర‌పంచంలో జరిగే కొన్ని సంఘ‌టన‌లు జీవితాల‌ను తారుమారు చేస్తుంటాయి. అలాంటి వార్తే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వివరాళ్లోకి వెళితే.. ఓ జంట‌కు పెండ్లై 6 ఏండ్లయింది. వారికి ఇద్దరు సంతానం కూడా. కానీ డీఎన్ఏ(DNA) ప‌రీక్ష వారి జీవితాల‌ను తారుమారు చేసింది. తాము తోడబుట్టిన వారిమని పిడుగు లాంటి విషయం తెలిసి నిశ్ఛేస్టులయ్యారు. అస‌లు విష‌యానికి వ‌స్తే.. అత‌డికి 6 ఏళ్ల క్రితం వివాహ‌మైంది. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా పుట్టారు. […]

విధాత‌: ప్ర‌పంచంలో జరిగే కొన్ని సంఘ‌టన‌లు జీవితాల‌ను తారుమారు చేస్తుంటాయి. అలాంటి వార్తే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వివరాళ్లోకి వెళితే.. ఓ జంట‌కు పెండ్లై 6 ఏండ్లయింది. వారికి ఇద్దరు సంతానం కూడా. కానీ డీఎన్ఏ(DNA) ప‌రీక్ష వారి జీవితాల‌ను తారుమారు చేసింది. తాము తోడబుట్టిన వారిమని పిడుగు లాంటి విషయం తెలిసి నిశ్ఛేస్టులయ్యారు.

అస‌లు విష‌యానికి వ‌స్తే.. అత‌డికి 6 ఏళ్ల క్రితం వివాహ‌మైంది. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా పుట్టారు. అయితే రెండో బిడ్డ జ‌న్మించిన త‌రువాత భార్య‌కు కిడ్నీ(Kidney) స‌మ‌స్య వ‌చ్చింది. వెంట‌నే కిడ్నీ మార్చాల‌ని డాక్ట‌ర్లు సూచించారు.

బంధువుల కిడ్నీ అమ‌ర్చేందుకు పరీక్ష‌లు చేయ‌గా ఎవ‌రివీ స‌రిపోలేదు. దీంతో త‌న భార్య కోసం తానే కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అందుకు చేయాల్సిన వైద్య ప‌రీక్ష‌లు అత‌డికి చేయ‌గా ఇద్ద‌రి కిడ్నీలు 100% స‌రిపోయాయి. ఫ‌లితాల‌ను చూసిన డాక్ట‌ర్లు షాక్‌కి గుర‌య్యారు.

ఇదెలా సాధ్య‌మ‌ని ఆశ్చ‌ర్య‌ పోయారు. దీంతో ఈ ఫ‌లితాలు ఆనందంతో పాటు అనుమానాన్ని రేకెత్తించాయి. ఇలా జ‌రిగే అవ‌కాశం లేద‌ని డాక్ట‌ర్లు చెప్పి.. భార్యాభ‌ర్త‌లిద్ద‌రికీ డీఎన్ఏ ప‌రీక్ష చేశారు. దాంతో వారు క‌లిసి పుట్టార‌నే విష‌యం అప్పుడు తెలిసి హతాశులయ్యారు.

అయితే పుట్టగానే అబ్బాయిని ద‌త్త‌త ఇవ్వడంతో త‌న త‌ల్లిదండ్రులు ఎవ‌రో తెలియ‌కుండానే పెరిగాడు. చిన్న వ‌య‌సులోనే ద‌త్త‌త తీసుకోవ‌డం వ‌ల్ల‌ ఆ అమ్మాయి త‌న సోద‌రి అని తెలియ‌క ఆరేళ్ల క్రితం వివాహం చేసుకొని జీవ‌నం సాగించాడు. విషయం తెలిశాక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ వ్య‌క్తి ఉన్నాడు.

Updated On 25 March 2023 4:21 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story