Cortisol కార్టిజల్ హార్మోనే కారణమా? విధాత: గాఢ నిద్రలో ఉండగా హఠాత్తుగా మెలకువ వచ్చేస్తోందా? మళ్లీ మళ్లీ ఇలానే జరుగుతుంటే ఒత్తిడిని కలిగించే కార్టిజల్ హార్మోన్ స్థాయిలు పెరగడమే కారణమని ఇటీవల సోషల్‌మీడియాలో కథనాలు, వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిపై వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏంటీ కార్టిజల్ హార్మోన్.. శరీరంలో ఉండే రెండు అడ్రినలిన్ గ్రంథులు ఈ కార్టిజాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. మనిషి ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఈ హార్మోన్ విడుదలవుతుంది. తద్వారా శరీర […]

Cortisol
కార్టిజల్ హార్మోనే కారణమా?
విధాత: గాఢ నిద్రలో ఉండగా హఠాత్తుగా మెలకువ వచ్చేస్తోందా? మళ్లీ మళ్లీ ఇలానే జరుగుతుంటే ఒత్తిడిని కలిగించే కార్టిజల్ హార్మోన్ స్థాయిలు పెరగడమే కారణమని ఇటీవల సోషల్‌మీడియాలో కథనాలు, వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిపై వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఏంటీ కార్టిజల్ హార్మోన్..
శరీరంలో ఉండే రెండు అడ్రినలిన్ గ్రంథులు ఈ కార్టిజాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. మనిషి ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఈ హార్మోన్ విడుదలవుతుంది. తద్వారా శరీర అంతర్గత ప్రక్రియను, రక్తపోటును, గుండెల్లో మంటను, మధుమేహ స్థాయులను నియంత్రిస్తుంది.
నిద్రలో ఉన్నపుడు హఠాత్తుగా ఇది విడుదల అవుతుండటంతో శరీరం చైతన్య స్థితిలోకి వచ్చి మెలకువ వస్తోందని నిపుణుల భావన. అయితే ఇలా ఎందుకు జరుగుతుందన్న దానికి సరైన కారణాన్ని కనుగొనాల్సి ఉంది. కార్టిజోల్ వైద్య పరిభాషలో ముద్దుగా శక్తినిచ్చే హర్మోన్గా పిలుస్తామని మార్క్ వెదరల్ అనే సైకో బయాలజీ ప్రొఫెసర్ తెలిపారు.
మనిషి ఒత్తిడిలో ఉన్నపుడు రోగ నిరోధక శక్తి నుంచి కొంత, ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి కొంత శక్తిని తీసుకుని కార్టిజల్ ఆ పరిస్థితి నుంచి బయట పడేయటానికి ప్రయత్నిస్తుంది. అని తెలిపారు. నిద్రకు ఒక సైకిల్ ఉన్నట్లే.. కార్టిజల్ ఉత్పత్తి, విడుదలకు ఒక సైకిల్ ఉంటుంది.
ఈ రెండూ విలోమానుపాతంలో పని చేస్తాయి. అంటే నిద్ర సైకిల్ నడుస్తున్నపుడు కార్టిజల్ ఉత్పత్తి కనిష్ఠ స్థాయిలో ఉంటుంది. అదే మనిషి మెలకువగా ఉండే సమయంలో దాని ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఇది విడుదలైతే శరీరం ఉత్తేజితంగా మారి నిద్ర పట్టడం కష్టమవుతుంది.
మెలకువ సమయంలోనైనా దీని ప్రభావం సాధారణంగానే ఉంటుంది. అయితే ఎప్పుడైనా శరీరం ఒత్తిడికి గురైతే దాని పరిమాణం పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో దీని అవసరం ఉంటుంది కానీ నిద్రలోనూ.. సాధారణం సందర్భాల్లోనూ కార్టిజల్ ఉత్పత్తి అయితే సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముంది. త్వరగా బరువు పెరగిపోవడం, డయాబెటిస్, ఎముకలు పెళుసుగా మారడం, చర్మం కళ కోల్పోవడం వంటి సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముంది.
అయితే కొన్ని రోజులుగా సోషల్‌మీడియా లో నిద్ర లేమి సమస్యకు కార్టిజల్ హార్మోన్‌ను ప్రధాన కారణంగా మార్చి చూపిస్తున్నారని స్లీప్ డాక్టర్‌గా ప్రసిద్ధి చెందిన మైఖేల్ బ్రూస్ అభిప్రాయపడ్డారు. 'ఈ సోషల్ మీడియాలో వచ్చే మెడికల్ సంబంధిత కథనాలకు ప్రాతిపదిక ఉండదు.
నిద్ర లేమి సమస్యకు కార్టిజల్ కారణమని చెబుతున్నారు. అది అసలు అవసరం లేనిదన్నట్లు మాట్లాడుతున్నారు. నిజమేమిటంటే కార్టిజల్ లేకపోతే మనకు అసలు మెలకువే రాదు' అని వెల్లడించారు. ఎవరైనా నిద్రా భంగం సమస్యతో బాధపడుతుంటే వారు వెంటనే వైద్యులను ఆశ్రయించాలని కారణం తెలుసుకుని చికిత్స పొందాలని సూచించారు.
