అత్యంత నీటి ఎద్ద‌డి ఉండే దేశం అయినా ప్ర‌పంచ ఫుట్ బాల్ క‌ప్ పోటీలు విజ‌య‌వంతం..! విధాత‌: ప్ర‌పంచ ఫుట్‌బాల్ క‌ప్ పోటీ అర‌బ్‌దేశం ఖ‌తార్‌లో ముగిసింది. 36 ఏండ్ల త‌ర్వాత అర్జెంటీనా మెస్సీ మాయ‌తో ఫిఫా క‌ప్ గెలిచింది. 29ల‌క్షల జ‌నాభా క‌లిగిన ఖ‌తార్‌ ప‌ది ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల‌కు ఆతిథ్య‌మిచ్చింది. పెద్ద పెద్ద దేశాలే ఫిఫా క‌ప్ నిర్వ‌హ‌ణ‌కు వెనుక‌డుగు వేసే ప‌రిస్థితుల్లో ఖ‌తార్ ఆ పని అవ‌లీల‌గా చేసి చూపింది. అంత‌క‌న్నా ముఖ్యంగా […]

  • అత్యంత నీటి ఎద్ద‌డి ఉండే దేశం
  • అయినా ప్ర‌పంచ ఫుట్ బాల్ క‌ప్ పోటీలు విజ‌య‌వంతం..!

విధాత‌: ప్ర‌పంచ ఫుట్‌బాల్ క‌ప్ పోటీ అర‌బ్‌దేశం ఖ‌తార్‌లో ముగిసింది. 36 ఏండ్ల త‌ర్వాత అర్జెంటీనా మెస్సీ మాయ‌తో ఫిఫా క‌ప్ గెలిచింది. 29ల‌క్షల జ‌నాభా క‌లిగిన ఖ‌తార్‌ ప‌ది ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల‌కు ఆతిథ్య‌మిచ్చింది.

పెద్ద పెద్ద దేశాలే ఫిఫా క‌ప్ నిర్వ‌హ‌ణ‌కు వెనుక‌డుగు వేసే ప‌రిస్థితుల్లో ఖ‌తార్ ఆ పని అవ‌లీల‌గా చేసి చూపింది. అంత‌క‌న్నా ముఖ్యంగా అతిచిన్న దేశం అతిపెద్ద పోటీకి వేదిక‌గా స‌క‌ల సౌక‌ర్యాల‌ను క‌లిగించి పోటీలు విజ‌య‌వంతం చేయ‌టం అబ్బురం, అద్బుతం.

ఎడారి దేశం ఖ‌తార్‌లో ప్ర‌పంచ ఫుట్ బాల్ ప్ర‌ధాన‌ పోటీల కోసం 8 పిచ్‌లు, ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం 136 పిచ్‌లు త‌యారు చేశారు. ఫుట్ బాల్ ఆట‌కు గ్రౌండ్‌లో ప‌చ్చ‌టి గ‌డ్డి మైదానాలు అవ‌స‌రం. ఆట‌కు అనుకూలంగా ఉండేందుకు రోజుకు ప‌దివేల లీట‌ర్ల నీరు ఉప‌యోగిస్తారు.

ఇలా పిచ్‌ల‌ను ప‌చ్చ‌గా, అనుకూలంగా ఉంచేందుకు రోజుకు ల‌క్ష‌ల లీట‌ర్ల నీరు వినియోగించారు. అలాగే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఉప‌యోగించేందుకు ఖ‌తార్ రాజ‌ధాని దోహాకు స‌మీపంలో 4,25,000 చ‌ద‌ర‌పు కి.మీ. విస్తీర్ణంలో ఎమ‌ర్జెన్సీ గ్రాస్ ఫీల్డ్ ను సిద్ధంగా ఉంచారు. ఇలా ఫుట్ బాల్ ఆట‌ల కోసం వెచ్చించిన నీరు, ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు ఏ లోటు లేకుండా ఖ‌తార్ ప్ర‌భుత్వం స‌క‌ల‌ ఏర్పాట్లు చేసింది.

ఒక్క న‌ది కూడా లేని ఖ‌తార్‌లో వ‌ర్ష‌పాతం 10 సెం.మీ. క‌న్నా త‌క్కువ‌. ఇలాంటి దేశంలో స‌హ‌జంగా ల‌భించే నీరు 14వేల మందికి మాత్ర‌మే స‌రిపోతుంది. అలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ ఫుట్ బాల్ పోటీల‌కు వేదికై ల‌క్ష‌ల మంది ప‌ర్యాట‌కుల అవ‌స‌రాలు ఖ‌తార్ ఎలా తీర్చ గ‌లిగింది?

ప‌ట్టుద‌ల, కృషి ఉంటే ఎంత‌టి క్లిష్ట‌మైన‌దైనా సాధించ వచ్చ‌ని ఖ‌తార్ నిరూపించింది. ఖ‌తార్ ప్ర‌జ‌ల దైనందిన అవ‌స‌రాలు మొద‌లు స‌క‌ల అవ‌స‌రాల‌కు శుద్ధి చేసిన స‌ముద్ర‌పు ఉప్పునీటినే వినియోగిస్తారు. ఉప్పునీటి నుంచి ల‌వ‌ణాలు తొల‌గించే ప్ర‌క్రియ (డీ శాలినేష‌న్‌) ద్వారా నీటిని శుభ్రం చేసి ఉప‌యోగిస్తారు. డీ శాలినేష‌న్ కోసం అవ‌స‌ర‌మైన శ‌క్తిని హైడ్రోకార్బ‌న్ ఇంధ‌నాల నుంచి ఉత్ప‌త్తి చేస్తారు.

చాలా త‌క్కువ సంఖ్య‌లో మాన‌వ వ‌న‌రులు, స‌హ‌జ వ‌న‌రులున్న దేశం ఖ‌తార్ ప్ర‌పంచ ఫుట్ బాల్ క‌ప్ పోటీల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించి ప్ర‌పంచాన్నే అబ్బుర ప‌రిచింది. నిబ‌ద్ధ‌త‌తో ఫిఫా పోటీల‌ను నిర్వ‌హించి ఔరా అనిపించుకున్న‌ది. దీంత అంత‌కు ప‌దింత‌ల ఆదాయాన్ని రాబ‌ట్టుకొన్న‌ది.

Updated On 19 Dec 2022 10:52 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story