తెలంగాణ పోరాటాలన్నీ భూముల కోసమే కాంగ్రెస్ పంచిన భూములపై పేదలకు హక్కు లేకుండా చేశారు మేం అధికారంలోకి వస్తే భూముల సమగ్ర సర్వే 100 రోజుల్లో ధరణి సమస్యలు పరిష్కరిస్తాం ధరణి లోక్ అదాలత్ లో కాంగ్రెస్ నేతలు Social Telangana only if Dharani is removed విధాత బ్యూరో కరీంనగర్: భూమి పేదవాడి ఆత్మగౌరవం.. అది వారి జీవన విధానం.. అందుకే రాబోయే రోజుల్లో 'మీ భూమి మీ హక్కు' కార్యక్రమాన్ని ఆరంభిస్తాం.. రాష్ట్రంలో […]

  • తెలంగాణ పోరాటాలన్నీ భూముల కోసమే
  • కాంగ్రెస్ పంచిన భూములపై పేదలకు హక్కు లేకుండా చేశారు
  • మేం అధికారంలోకి వస్తే భూముల సమగ్ర సర్వే
  • 100 రోజుల్లో ధరణి సమస్యలు పరిష్కరిస్తాం
  • ధరణి లోక్ అదాలత్ లో కాంగ్రెస్ నేతలు

Social Telangana only if Dharani is removed

విధాత బ్యూరో కరీంనగర్: భూమి పేదవాడి ఆత్మగౌరవం.. అది వారి జీవన విధానం.. అందుకే రాబోయే రోజుల్లో 'మీ భూమి మీ హక్కు' కార్యక్రమాన్ని ఆరంభిస్తాం.. రాష్ట్రంలో భూములకు సంబంధించి ఉన్న 125 చట్టాలు, 30 వేల జీవోలను తొలగించి ఒకే చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్(Congress) నేతలు స్పష్టం చేశారు.
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో నిర్వహించిన ధరణి అదాలత్(Dharani Adalath) లో పిసిసి(PCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు ఆ పార్టీకి చెందిన జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొని మాట్లాడారు. ధరణి పోర్టల్ ను తొలగించడం ద్వారానే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని వారు విస్పష్టంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ధరణి బాధితులకు హామీ కార్డులు అందజేశారు.

అనంత‌రం ఏఐసీసీ(AICC) ప్రధాన కార్యదర్శి జై రామ్ రమేష్(Jai Ram Ramesh) మాట్లాడుతూ రాష్ట్రంలో భూ యాజమాన్యానికి సంబంధించి 60 లక్షల మంది పేర్లు ఉంటే దాదాపు 20లక్షల ఖాతాల్లో ధరణి పోర్టల్ కారణంగా సమస్యలు తలెత్తాయన్నారు. ధరణి పోర్టల్ ఉద్దేశం ఒకరి ఫోటో తీసి మరొకరికి పెట్టడం కాదని, ఎవరి భూములపై వారి హక్కులు కల్పించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లలో భూముల సమగ్ర సర్వే చేయిస్తామన్నారు. తెలంగాణలోని 15 లక్షల మంది కౌలు రైతులకు
ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదన్నారు.

రైతుల నుండి బలవంతంగా భూసేకరణను నిషేధించడమే కాక అందుకు సంబంధించిన చట్టాలను తమ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో పేదల భూములను వారికి కాకుండా చేస్తుందని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్ రావు ఠాక్రే ఆరోపించారు. పేదల భూములు వారికి చెందెంతవరకు ధరణి ఆదాలత్ కొనసాగిస్తామన్నారు.

ధరణి సమస్యలపై తాము నిర్వహించిన గ్రామసభ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ళు తెరిపిస్తుందని ఆశిస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సరళీకృత విధానాల ద్వారా మిగులు భూములు పేదలకు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ హయంలో 22 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చి పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు 10 లక్షల ఎకరాలు పంపిణీ చేశామన్నారు.

ధరణి పోర్టల్ ధనవంతుల కోసమే ప్రారంభమైందని, దీని ద్వారా వేలకోట్ల రూపాయలు కేసీఆర్ బంధువుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. గతంలో పేదలకు భూములు పంచి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టామని, ప్రస్తుతం ఆ భూములు వారికి అందేలా చేసి ఆ ఆత్మగౌరవాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ధరణి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూమి ఒక్కటే ఉత్పత్తి రంగంగా ఉన్ననాడు మిగులు భూములను పేదలకు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు పంచిన భూములు ధరణి చట్టంలోకి రాకుండా పక్కన పెట్టింది అన్నారు. కాస్తు కాలం తొలగించి, తిరిగి భూములను భూస్వాములకు అప్పగించడం ప్రమాదకరమైన పరిణామం అన్నారు.
ఫ్యూడల్ వ్యవస్థను, భూస్వామ్య విధానాన్ని బీఆర్ఎస్ మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో తమ భూములపై యాజమాన్య హక్కుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ధరణితో న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. కాంగ్రెస్ హయాంలో లక్షలాది మంది నిరుపేదలకు అసైన్డ్ భూములు ఇస్తే ఈ ప్రభుత్వం వారికి ఆ భూములపై హక్కు లేకుండా చేసిందన్నారు. ధరణి పేరుతో అసైన్డ్ భూములను పేదలకు కాకుండా చేయడం దుర్మార్గమైన విషయం అన్నారు. రాష్ట్రంలో 20లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.

ఈ సందర్భంగా సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పల్లె రాజేశం, అప్పాల సాగర్, గౌరు శైలజ,
రాయపాక రాజమ్మ, కవ్వంపల్లి జ్యోతి, గోపిక చంద్రయ్య తదితరులకు కాంగ్రెస్ నేతలు గ్యారంటీ కార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, చింతకుంట విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated On 10 March 2023 4:06 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story