Nalgonda ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు రోజూ వందలాది ట్రాక్టర్లలో తరలింపు మితిమీరిన అక్రమార్కుల ఆగడాలు విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: జిల్లాలో మట్టిమాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ భూములపై కన్నేసిన అక్రమారులు.. యథేచ్ఛగా మట్టి దోపిడీకి తెగబడుతున్నారు. తాజాగా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో మట్టిని లూటీ చేసేస్తున్నారు. గ్రామంలోని 739 సర్వే నెంబర్ లో 70 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గ్రామానికి చెందిన మట్టిమాఫియా కన్ను ఈ స్థలంపై పడింది. ఎలాంటి అనుమతులు […]

Nalgonda

  • ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు
  • రోజూ వందలాది ట్రాక్టర్లలో తరలింపు
  • మితిమీరిన అక్రమార్కుల ఆగడాలు

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: జిల్లాలో మట్టిమాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ భూములపై కన్నేసిన అక్రమారులు.. యథేచ్ఛగా మట్టి దోపిడీకి తెగబడుతున్నారు. తాజాగా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో మట్టిని లూటీ చేసేస్తున్నారు. గ్రామంలోని 739 సర్వే నెంబర్ లో 70 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గ్రామానికి చెందిన మట్టిమాఫియా కన్ను ఈ స్థలంపై పడింది. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా జేసీబీతో మట్టిని తవ్వేస్తున్నారు.

కాగా.. అక్రమంగా ట్రాక్టర్లతో తరలిస్తూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అడిగే వారే కరువయ్యారు. మరోవైపు అక్రమ మట్టి రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతుతోంది. గ్రామస్థులు ఈ విషయమై పలుమార్లు ఎమ్మార్వో, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐనా పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష స్థానిక నేతల అండదండలతోనే మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని గ్రామస్థులు వాపోతున్నారు.

రంగంలోకి రెవెన్యూ అధికారులు

ఆమనగల్లు గ్రామం మండల కేంద్రానికి దూరంగా ఉంటుంది. మట్టి మాఫియా ఆగడాలపై సమాచారం ఇచ్చినా, అధికారులు వచ్చేలోపు తప్పించుకుంటున్నారు. అనంతరం యథావిధిగా రెండు జేసీబీలు, కనీసం 50 ట్రాక్టర్లతో మట్టిని తరలించడం రోజూ జరుగుతున్న తతంగమే. మట్టి మాఫియా దోపిడీపై సంబంధిత రెవెన్యూ అధికారి ఎమ్మార్వో కి ఫోన్ ద్వారా వివరించారు. వెంటనే వేములపల్లి ఆర్ఐ ను గ్రామానికి పంపారు.

కాగా.. రెండు రోజుల్లో అక్రమ రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. 739 సర్వే నెంబరులో ఎంత భూమి ఉందో విచారించి, చుట్టూ కంచె వేస్తామని చెప్పారు. మట్టి మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో ప్రభుత్వ భూమిని గుర్తించి నిరుపేదలు, భూమిలేని వారికి పట్టాలిచ్చి పంపిణీ చేయాలని ఆమనగల్లు గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated On 16 Sep 2023 12:33 PM GMT
somu

somu

Next Story