విధాత: కాలం ఎవరి కోసమూ ఆగకుండా తన మానాన తాను పయనిస్తూనే ఉంది. ఈ ప్రహసనంలో జీవితాలు ఎంతో ప్రబావితం అవుతూనే ఉన్నాయి. వేల సంవత్సరాలుగా పరిణామం క్రమబద్ధంగా జరుగుతూనే ఉంది. ఈ పరిణామాలు ఎన్ని మార్పులు జరిగినా కొన్ని నియమాలు ప్రకృతిలో ఎప్పటికీ మారలేదు. అటువంటి కొన్ని నియమాలను భారతంలోని విదుర నీతి చక్కగా వివరించింది. దృతరాష్ట్రుడికి విదురుడు చెప్పిన మాటలు విదుర నీతిగా లోకంలో ప్రసిద్ధి చెందాయి. అతడ మాటల్లో ఎన్నో జీవిత సత్యాలు […]

విధాత: కాలం ఎవరి కోసమూ ఆగకుండా తన మానాన తాను పయనిస్తూనే ఉంది. ఈ ప్రహసనంలో జీవితాలు ఎంతో ప్రబావితం అవుతూనే ఉన్నాయి. వేల సంవత్సరాలుగా పరిణామం క్రమబద్ధంగా జరుగుతూనే ఉంది. ఈ పరిణామాలు ఎన్ని మార్పులు జరిగినా కొన్ని నియమాలు ప్రకృతిలో ఎప్పటికీ మారలేదు. అటువంటి కొన్ని నియమాలను భారతంలోని విదుర నీతి చక్కగా వివరించింది. దృతరాష్ట్రుడికి విదురుడు చెప్పిన మాటలు విదుర నీతిగా లోకంలో ప్రసిద్ధి చెందాయి. అతడ మాటల్లో ఎన్నో జీవిత సత్యాలు ఉంటాయి. అవి ఇప్పటికీ ఆచరణీయాలు. వాటిలో కొన్ని ఇక్కడ తెలుసుకుందాం.

  • తను తాను గొప్పవాడినిని అనుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్లు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లఉ జీవితంలో దేనికీ విలువనివ్వరు.
  • అతిగా మాట్లాడడం అంత మంచి లక్షణం కాదు. దీని వల్ల చాలా సమస్యలు రావచ్చు. ఇలా అతిగా మాట్లాడే వారు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యువు వెంటాడుతుంది. ఇది నరకానికి దగ్గరి దారి.
  • తన కోపమే తన శత్రువు. ఇది మానవుని అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు నేరుగా నరకానికే పోతారట.
  • ఇతరులకు సేవ చేయనివారు, సహాయపడనివారు కూడా నేరుగా నరకానికి పోతరాట. ఎదుటివాళ్లను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట.
  • స్నేహితులను, కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు బార్లా తెరచి ఉంటాయట. స్నేహితులతో నిజాయితీగా ఉండాలి.
  • మనిషి దుర్గుణాల్లో అసూయ, స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది. ఈ లక్షణాలను వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారు.
  • జీవితంలో మార్పు కోరుకుంటే దాని కోసం ఏదైనా ఆలోచన చెయ్యాలి. అది ఆచరణలో ఉంచాలి. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మంచి జరగడం కోసం చెడు సమయాల్లో నిర్ణయాలు తీసుకోవద్దు.
  • జీవితమంటే మంచి, చెడులు, కష్టసుఖాల కలయిక. కాబట్టి ఎలాంటి వాటినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి. చెడు గురించి విచారం వద్దు, అది ఎల్లకాలం ఉండదు.
  • డబ్బు శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి. ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే లక్ష్యం కేవలం డబ్బుతో మాతమే సాధ్యం కాదు. అందుకు తగిన ఆలోచనా విధానం, ఆచరణీయ జీవన విధానం ఉండాలి.
  • ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోడానికి ప్రయత్నిస్తుండాలి. నేర్చుకునే వాటితో తృప్తి చెందితే అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది. ఎక్కడైతే సౌకర్యంగా ఉండడం మొదలవుతుందో ఇక అక్కడ ఉండడం వల్ల నేర్చుకోవడం ఆగిపోతుందని తెలుసుకోవాలి. జీవితంలో మార్పు సహజం. దానికి సర్వదా సన్నధ్దంగా ఉండాలి.
  • భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా మీరు మీ అదుపులోనే ఉండేట్టు జాగ్రత్త పడాలి. అందువల్ల మీ ప్రయాణం మీ అదుపాజ్ఞలలో సాగుతుంది. ప్రతి మలుపు మీ ఎరుకలో ఉంటుంది.
  • మీరు మీతో నిజాయితీగా ఉన్నారో లేదో ప్రశ్నించుకోవాలి. ఇతరులకు చెప్పేముందు ఆత్మ పరిశీలన ద్వారా మనల్ని మనం అంచనా వేసుకోవాలి. అత్మ ప్రబోధానికి మించిన జ్ఞాన బోధ లేదు.
  • కాస్త ఒత్తిడి మంచి జీవితానికి దారి ఏర్పాటు చేసుకునేందుకు అవసరం. కాబట్టి కొన్ని విషయాల్లో ఒత్తిడి విజయానికి దోహదం చేస్తుంది. విజయం కావాలనుకుంటే కాస్త ఒత్తిడిని భరించే శక్తి కలిగి ఉండడం మంచిదే.
Updated On 9 Nov 2022 9:46 AM GMT
krs

krs

Next Story