విధాత: ఒకే కుమారుడు అని గారాబంగా పెంచారు. అడిగినన్నీ డబ్బులు ఇచ్చేవారు. కానీ ఆ అబ్బాయి మాత్రం చదువును మధ్యలోనే ఆపేసి వ్యసనాలకు బానిస అయ్యాడు. చివరకు తల్లితో కూడా అనుచితంగా ప్రవర్తించాడు. కుమారుడి వికృత చేష్టలకు విసిగిపోయిన తల్లిదండ్రులు.. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్ వద్ద అక్టోబర్ 19న మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన కేసును దర్యాప్తు చేయగా ఈ హత్య కేసు […]

విధాత: ఒకే కుమారుడు అని గారాబంగా పెంచారు. అడిగినన్నీ డబ్బులు ఇచ్చేవారు. కానీ ఆ అబ్బాయి మాత్రం చదువును మధ్యలోనే ఆపేసి వ్యసనాలకు బానిస అయ్యాడు. చివరకు తల్లితో కూడా అనుచితంగా ప్రవర్తించాడు. కుమారుడి వికృత చేష్టలకు విసిగిపోయిన తల్లిదండ్రులు.. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్ వద్ద అక్టోబర్ 19న మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన కేసును దర్యాప్తు చేయగా ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన క్షత్రియ రామ్ సింగ్, రాణిబాయి దంపతులకు సాయినాథ్(26), కుమార్తె సంతానం. సత్తుపల్లిలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో రామ్ సింగ్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. ఇక కుమారుడు సాయినాథ్ తన డిగ్రీ విద్యను మధ్యలోనే ఆపేశాడు.

జులాయిగా తిరుగుతూ, వ్యసనాలకు బానిసగా మారాడు. గత నాలుగేండ్ల నుంచి డబ్బుల కోసం తల్లిదండ్రులను తీవ్రంగా వేధించాడు. ఇటీవలే తల్లితో కూడా అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో తమకు ఇలాంటి కుమారుడు అవసరం లేదని భావించిన రామ్ సింగ్ దంపతులు.. అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో రాణిబాయి సోదరుడు సత్యనారాయణకు సాయినాథ్ ను హత్య చేయాలని చెప్పారు. మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన రమావత్ రవి(ఆటో డ్రైవర్)ని సత్యనారాయణ ఆశ్రయించాడు. రవితో పాటు మరో ముగ్గురు కలిసి రూ. 8 లక్షలకు సాయినాథ్ ను హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

దీంతో అక్టోబర్ 18వ తేదీన సత్యనారాయణ, రవి కలిసి దావత్ చేసుకుందామని చెప్పి సాయినాథ్ ను నల్లగొండ జిల్లాలోని కల్లేపల్లి మైసమ్మ ఆలయం వద్దకు తీసుకెళ్లారు. ఇక అక్కడ అందరూ పీకల దాకా మద్యం సేవించారు. ఆ తర్వాత సాయినాథ్ మెడకు తాడు బిగించి చంపేశారు. సాయినాథ్ కారులోనే డెడ్ బాడీని తీసుకెళ్లి మూసీ నదిలో పడేశారు. మరుసటి రోజే మూసీలో శవం తేలియాడంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.

నిందితులను పట్టించిన కారు

అయితే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల తర్వాత సాయినాథ్ తల్లిదండ్రులు వచ్చి శవాన్ని తీసుకెళ్లారు. అయితే శూన్యంపహాడ్ వద్ద కనిపించిన కారు, డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు తీసుకొచ్చిన కారు ఒకటేనని సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిర్ధారించారు. దీంతో రామ్ సింగ్ దంపతులను అదుపులోకి తీసుకొని విచారించగా, తామే కుమారుడిని చంపించినట్లు అంగీకరించారు. తల్లిదండ్రులు, మేనమామతో పాటు నలుగురిని అరెస్టు చేశారు.మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated On 3 Nov 2022 11:54 PM GMT
subbareddy

subbareddy

Next Story