విధాత: కొన్ని నెలల కిందట ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi liquor case)లో విచారణ జరుగుతున్న సమయంలోనే నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi)ని ఈడీ (ED) విచారించింది. అప్పుడు విచారణ సందర్భంగా సోనియా కుమారుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi), కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు.
ఆ సమయంలోనే విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రం ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదంటూ దానికి నిరసనగా రాహుల్ పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. సోనియాను ఈడీ విచారిస్తున్న సమయంలో ఆమె కుమార్తె ప్రియాంక తనతోనే ఉన్నారు.
దీనిపై ఈడీ అధికారులను ప్రశ్నిస్తే తన తల్లికి వైద్య సహాయం అవసరమైతే మందులతో ఈడీ కార్యాలయంలోని మరో గదిలో కూర్చున్నట్టు తెలిపారు. ఇదే కాదు చాలా స్కాంలలో ముఖ్యమంత్రులు, వారి కుటుంబసభ్యులు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేసిన సందర్భంగా ఎన్నడూ ఇంత హడావుడి లేదు. ఢిల్లీ హంగామా అంతకంటే లేదు.
మద్యం కేసులో ఈడీ విచారణకు హాజరు కావాలని కవిత (MLC Kavitha)కు నోటీసులు ఇస్తే ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా తాను 9న విచారణకు హాజరు కాలేనని, 11న హాజరవుతానని ఆమె ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈలోగా మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ తో ఎమ్మెల్సీ కవిత చేపట్టే ధర్నాకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ఆమె మీడియాతో మాట్లాడుతుండగానే చెప్పారు. మా దీక్ష కొనసాగుతుందని చెప్పిన ఆమె నిన్న జంతర్‌మంతర్ వద్ద ఒక నిరాహారదీక్ష చేశారు.
ఆమెకు కాంగ్రెస్ మినహా సీపీఎం(ఐ), ఆప్, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ సహా అనేక పార్టీలు, సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ నేతలు మహిళా గోస- బీజేపీ భరోసా దీక్ష (Mahila Gosa- BJP Bharosa Deeksha) కార్యక్రమం చేపట్టింది. తెలంగాణలో మహిళల సమస్యలపై ఏనాడు మాట్లాడని కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ((MLC Kavitha))కు మహిళా బిల్లుపై దీక్ష చేసే హక్కు లేదని, ఆమె ఢిల్లీలో కాదు, సీఎం ఇంటి ముందు దీక్ష చేయాలని బండి సంజయ్ అన్నారు.
ఈ పోటా పోటీ దీక్షలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అంతేకాదు నేషనల్ హెరాల్డ్ కేసులో 78 ఏళ్ల సోనియాగాంధీ కరోనాతో ఇబ్బంది పడుతున్న సమయంలోనే ఆస్పత్రి నుంచి రప్పించి మరీ ఈడీ అధికారులు విచారణ చేపట్టారని, మద్యం కేసు వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ అలా ఎందుకు వ్యవహరించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ధ్వజమెత్తారు.
మూడు రోజులుగా మీడియా అటెన్షన్ అంతా ఢిల్లీలో బీఆర్‌ఎస్, రాష్ట్రంలో బీజేపీపైనే ఉన్నది. ఢిల్లీ మద్యం కేసులో విచారణ కోసం ఎమ్మెల్సీ కవిత గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇవాళ ఆమెను ఈడీ విచారించనున్న వేళ పార్టీ కార్యకర్తలు, నేతలు ఈడీ ఆపీసుకు చేరుకోకుండా ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ముమ్మర భద్రత ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యాలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. తనపై వస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలే అంటూ.. ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ కేసులో కవితను అరెస్టు చేయకుండా ముద్దుపెట్టుకుంటారా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇరు పార్టీల మధ్య ఈరోజుల ఘర్షణ వాతావరణ నెలకొన్నది. పోటాపోటీగా దిష్టిబొమ్మలు దహన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కేసులో విచారణ పేరుతో బీజేపీ, బీజేపీ వైఖరిని తప్పుపడుతూ బీఆర్‌ఎస్ (BRS) నేతలు చేస్తున్న విమర్శలు చూస్తుంటే… నిన్న కవిత దీక్షపై కాంగ్రెస్ జాతీయ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ.. ఇతర అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కవిత ధర్నా చేశారు అనే మాటలను నిజమే అని నెటీజన్లు అంటున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాలను పక్కదోవ పట్టించడానికే ఈ రెండు పార్టీలు ఇదంతా చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.