పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌ సోనియా నిర్ణయం అనంతరం ‘ఇండియా’ భేటీ సమావేశం ప్రత్యేక సమావేశాల్లో వ్యూహంపై చర్చ మహిళా బిల్లుపైనా సమాలోచనలు! Congress | న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌ అత్యవసర సమావేశాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌ సోనియా ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఐఎన్‌డీఐఏ కూటమి పార్లమెంటరీ నేతలు కూడా ప్రత్యేక […]

  • పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌ సోనియా నిర్ణయం
  • అనంతరం ‘ఇండియా’ భేటీ సమావేశం
  • ప్రత్యేక సమావేశాల్లో వ్యూహంపై చర్చ
  • మహిళా బిల్లుపైనా సమాలోచనలు!

Congress | న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌ అత్యవసర సమావేశాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌ సోనియా ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఐఎన్‌డీఐఏ కూటమి పార్లమెంటరీ నేతలు కూడా ప్రత్యేక పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మంగళవారమే సమావేశం కానున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ సమావేశం అనంతరం ఈ సమావేశం కొనసాగుతుంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూటమి ఉమ్మడిగా అనుసరించాల్సిన వ్యూహం ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. ముంబైలో ఇండియా కూటమి మూడో సమావేశం ముగిసిన మూడు రోజులకే మళ్లీ నేతలు సమావేశం కానుండటం విశేషం.

అయితే.. ఇండియా కూటమి ముంబై భేటీని ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు, జమిలి ఎన్నికలపై లీకులతో బీజేపీ దాదాపు కప్పేసి, చర్చను దారి మళ్లించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అదానీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే బీజేపీ సర్కారు ప్రత్యేక సమావేశాలు, జమిలి ఎన్నికలు, గ్యాస్‌ ధర తగ్గింపు తదితర చర్యలకు దిగిందని ప్రతిపక్షం అనుమానిస్తున్నది. వీటితోపాటు జమిలి ఎన్నికలపై ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి తనకు తాను తప్పుకోవడంపైనా ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.

అదానీ వ్యవహారం మళ్లీ చర్చలోకి వచ్చిన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు కాంగ్రెస్‌ పట్టుబడుతున్నది. దీనిపైనా కూటమి నేతలు చర్చించనున్నారు. మహిళా కోటా బిల్లును సైతం తీసుకువస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమి ఉమ్మడిగా తీసుకోవాల్సిన వైఖరిపైనా చర్చించే అవకాశం ఉన్నది. సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ వంటి పార్టీలు మహిళలకు ఎన్నికల్లో ఓబీసీ కోటా అమలు చేయాలని కోరుతున్నాయి. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు అనుగుణంగా కోటాలోనే మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలనేది కాంగ్రెస్‌ వైఖరిగా ఉన్నది.

Updated On 5 Sep 2023 2:42 AM GMT
somu

somu

Next Story