Gaddar | విధాత: ఇటీవల మరణించిన ప్రజాయుద్దనౌక గద్దర్ కుటుంబాన్నికాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పరామర్శించారు. సీడబ్ల్యుసీ సమావేశాల వేదిక తాజ్‌కృష్ణలో గద్దర్ భార్య విమల, కుమారుడు సూర్యం, కూతురు వెన్నెలలను వారు పరామర్శించి ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ నేత మధుయాష్కి మీడియాకు వెల్లడించారు. గద్దర్ మరణవార్త తెలుసుకుని సోనియాగాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. నిజానికి ఈ రోజు సోనియాగాంధీ స్వయంగా గద్దర్ నివాసాని వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించాల్సి […]

Gaddar |
విధాత: ఇటీవల మరణించిన ప్రజాయుద్దనౌక గద్దర్ కుటుంబాన్నికాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పరామర్శించారు. సీడబ్ల్యుసీ సమావేశాల వేదిక తాజ్‌కృష్ణలో గద్దర్ భార్య విమల, కుమారుడు సూర్యం, కూతురు వెన్నెలలను వారు పరామర్శించి ఓదార్చారు.
ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ నేత మధుయాష్కి మీడియాకు వెల్లడించారు. గద్దర్ మరణవార్త తెలుసుకుని సోనియాగాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. నిజానికి ఈ రోజు సోనియాగాంధీ స్వయంగా గద్దర్ నివాసాని వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించాల్సి వుండగా, అనివార్య కారణాలతో వెళ్లలేక పోయారన్నారు. సోనియా విజ్ఞప్తి మేరకు గద్దర్ కుటుంబం తాజ్‌కృష్ణకు రావడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా గద్దర్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని సోనియా, రాహుల్‌గాంధీలు గుర్తు చేసుకున్నారని, భవిష్యత్తులో ఇంటికి వచ్చి కలుస్తామని వారికి చెప్పడం జరిగిందన్నారు. గద్దర్ కుమారుడు సూర్యం మాట్లాడుతూ తన తండ్రి మరణం పట్ల సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలు పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని సోనియాగాంధీ చెప్పడం జరిగిందన్నారు.
